
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. బాలకృష్ణ ఈసారి రెండు పవర్ఫుల్ పాత్రల్లో కనిపించి అలరిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి మొదటినుండీ మోనార్క్ లేదా గాడ్ ఫాదర్ టైటిల్స్ గా ప్రచారం జరుగుతున్నాయి. ఈ రెండిట్లో ఒక టైటిల్ ను ఉగాదికి ప్రకటిస్తారని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ ఫాలోయర్ గా ఒక యంగ్ హీరో నటిస్తాడని తెలుస్తోంది. ఆ యంగ్ హీరో మరెవరో కాదు మంచు మనోజ్ అంటున్నారు. గతంలో మనోజ్ సినిమాలో బాలకృష్ణ ఒక కీలక పాత్రను పోషించారు. ఈసారి బాలకృష్ణ సినిమాలో మనోజ్ తన ఫాలోయర్ గా ఉంటాడని సమాచారం.
మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.