Homeటాప్ స్టోరీస్అల్లూరి సీతారామ‌రాజు బడ్జెట్ ఎంత‌?

అల్లూరి సీతారామ‌రాజు బడ్జెట్ ఎంత‌?

అల్లూరి సీతారామ‌రాజు బడ్జెట్ ఎంత‌?
అల్లూరి సీతారామ‌రాజు బడ్జెట్ ఎంత‌?

సూప‌ర్‌స్టార్ కృష్ణ న‌టించిన సంచ‌ల‌న చిత్రం `అల్లూరి సీతారామ‌రాజు`. మ‌న్యం వీరుడు అల్లూరి స్ఫూర్తి వంత‌మైన జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప‌ద్మాల‌య బ్యాన‌ర్‌పై .జి. ఆదిశేష‌గిరిరావు నిర్మించారు. వి. రామ‌చంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం విడుద‌లై నేటితో 46 వ‌సంతాలు పూర్త‌య్యాయి. 1974 మే 1న ఈ చిత్రం విడులైంది.  ముందు అల్లూరి సీతారామ‌రాజు జీవితంపై సినిమా చేయాల‌ని స్వ‌ర్గీయ ఎన్టీరామారావు ప్ర‌య‌త్నాలు చేశారు.

అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో తాతినేని ప్ర‌కాశ‌రావు ఈ చిత్రాన్ని చేయాల‌ని ప్ర‌య‌త్నించారు కానీ కుద‌ర‌లేదు. నిర్మాత డీ.ఎల్‌. శోభ‌న్‌బాబుతో అల్లూరి క‌థ‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నించార‌ట‌. అదీ సాధ్య‌ప‌డ‌లేదు. కొన్ని సినిమాలు, పాత్ర‌లు కొంద‌రి కోసం మాత్ర‌మే పుడ‌తాయి అన్న‌ట్టు చివ‌రికి ఆ అదృష్టం సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ద‌క్కింది. కృష్ణ న‌టించిన 100వ చిత్ర‌మిది. దేశ భ‌క్తి అంటే తెలుగు వాళ్ల‌కు ముందుగా గుర్తొచ్చే సినిమా ఇదే కావ‌డం విశేషం.

- Advertisement -

ఈ చిత్రానికి అప్ప‌ట్లో అయిన బ‌డ్జెట్ 10 ల‌క్ష‌లు.  60 రోజుల్లో ఈ చిత్రాన్నిపూర్తి చేశారు. ప్ర‌ధానంగా వైజాగ్ ఏజెన్సీలోని ప‌లు ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. హిందీ మూవీ `పాకీజా` తీసిన సినిమా స్కోప్ లెన్స్‌ని ఈ తొలి సారి ఈ చిత్రానికి ఉప‌యోగించారు. తెలుగులో తొలి సినిమా స్కోప్ చిత్రం ఇదే. ఇప్ప‌టికీ అల్లూరి సీతారామ‌రాజు అంటే అంద‌రికి ఈ చిత్ర‌మే గుర్తొస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All