Homeగాసిప్స్కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నాకే మ‌హేష్ సినిమా!

కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నాకే మ‌హేష్ సినిమా!

కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నాకే మ‌హేష్ సినిమా!
కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నాకే మ‌హేష్ సినిమా!

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్‌`. డీవివి దాన‌య్య అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్, ఆదివాసీ పోరాట యోధుడు కొమ‌రం భీం పాత్ర‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నారు.

ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భ‌గా విడుద‌ల చేసిన రామ్‌చ‌ర‌ణ్ లుక్ టీజ‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సంద‌ర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన‌ రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. దీంతో సినిమాపై పూర్తి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం వుంది. ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత మ‌హేష్‌తో రాజ‌మౌళి సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

అయితే ఈ చిత్రాన్ని మాత్రం చాలా ఆల‌స్యంగా ప్రారంభిస్తార‌ట‌. `ఆర్ ఆర్ ఆర్` త‌రువాత కొంత స‌మ‌యం విశ్రాంతి తీసుకుని ఆ త‌రువాతే మ‌హేష్ చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తాన‌ని రాజ‌మౌళి చెబుతున్నాఉ. పైగా ఈ చిత్రాన్ని ఏ జాన‌ర్లో చేయ‌బోతున్నామ‌నేది ఇంకా నిర్ణ‌యించుకోలేద‌ని, మ‌హేష్ ఇమేజ్‌, బాడీ లాంగ్వేజ్‌తో పాటు త‌న అభిరుచికి త‌గ్గ‌ట్టు క‌థ‌తో సినిమా వుంటుంద‌ని జ‌క్క‌న్న క్లారిటీ ఇచ్చాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All