Homeటాప్ స్టోరీస్రెబ‌ల్‌స్టార్‌తో పాన్ ఇండియా స్టార్‌!

రెబ‌ల్‌స్టార్‌తో పాన్ ఇండియా స్టార్‌!

Krishnam raju and Prabhas pose goes viral
Krishnam raju and Prabhas pose goes viral

పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు. త‌న సోద‌రుడు సూర్య‌నారాయ‌ణ‌రాజు త‌న‌యుడు ప్ర‌భాస్ హీరోగా పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకోవ‌డం.. వ‌రుస పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ బిజీగా వుండ‌టంతో పెద‌నాన్న రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు పుత్రోత్సాహంతో గాల్లో తేలిపోతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో రూపొందుతున్న `రాధేశ్యామ్‌` చిత్రానికి కృష్ణంరాజు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వీరిద్ద‌రూ క‌లిసి సినిమా ఎప్పుడు చేస్తారా అని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఎదురుచూపుల‌కు తెర‌ప‌డ‌బోతోంద‌ని తెలుస్తోంది. రాధాకృష్ణ‌కుమార్ తెర‌కెక్కిస్తున్న `రాధేశ్యామ్‌`లో రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు హీరో ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించార‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్న‌ట్టుగా అభిమానుల‌కు చిన్న స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు రెబ‌ల్‌స్టార్. ప్ర‌భాస్‌తో క‌లిసి ఓ పోజు పెట్టి ఫొటోల‌కు పోజులిచ్చారు. ఆ ఫొటోని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు.

- Advertisement -

`ప్ర‌భాస్‌తో క‌లిసి1970వ కాలాన్ని గుర్తు చేస్తా. జూలై 30న `రాధేశ్యామ్‌`తో ఆ కాలంలోకి తిరిగి వెళ‌దాం` అని ట్వీట్ చేశారు కృష్ణంరాజు. కృష్ణంరాజు, ప్ర‌భాస్ ఒకే పోజులో నిల‌బ‌డి ఫొటోల‌కు పోజులిచ్చిన ఫొటో నెట్టింట సంద‌డి చేస్తోంది. యూర‌ప్ నేప‌థ్యంలో హెరిటేజ్ ల‌వ్‌స్టోరీగా `రాధేశ్యామ్` చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All