Homeటాప్ స్టోరీస్`కృష్ణ అండ్ హిస్ లీలా` మూవీ రివ్యూ

`కృష్ణ అండ్ హిస్ లీలా` మూవీ రివ్యూ

`కృష్ణ అండ్ హిస్ లీలా` మూవీ రివ్యూ
`కృష్ణ అండ్ హిస్ లీలా` మూవీ రివ్యూ

ద‌ర్శ‌క‌త్వం: ర‌వికాంత్ పేరేపు
నిర్మాత‌లు:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, వ‌యాక‌మ్ 18 చేష‌న్ పిక్చ‌ర్స్‌, సంజ‌య్ రెడ్డి,
న‌టీన‌టులు :  సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌, సీర‌త్ క‌పూర్, శాలిని వ‌డ్ని క‌ట్టి,
సంగీతం: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌,
రిలీజ్ డేట్‌: 25 – 06-2020

`క్ష‌ణం` చిత్రంతో విభిన్న‌మైన చిత్రాన్ని అందించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్నారు యువ ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ పేరేపు. కొంత విరామం త‌రువాత ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రం `కృష్ణ అండ్ హిస్ లీలా`. `గుంటూర్ టాకీస్` ఫేమ్ సిద్ధు హీరోగా న‌టించారు. `జెర్సీ` ఫేమ్ శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌, సీర‌త్ క‌పూర్ హీరోయిన్‌లుగా న‌టించారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్ డౌన్ విధించిన ద‌గ్గ‌రి నుంచి థియేట‌ర్లు మూసి వేయ‌డంతో రిలీజ్‌కి రెడీగా వున్న సినిమాకు ఓటీటీలే శ‌ర‌ణ్యంగా మారాయి. దీంతో చిన్నా పెద్దా చిత్రాల‌న్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ‌`కృష్ణ అండ్ హిస్ లీలా`. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ గురువారం రిలీజ్ అయింది. ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్‌గా రిలీజైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకుందా?  లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
కృష్ణ (సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌) స‌త్య ( శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌) ప్రేమించుకుంటారు. మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఇద్ద‌రు విడిపోతారు. ఆ త‌రువాత కొన్ని రోజుల‌కే  రాధ ( శాలిని వ‌డ్నిక‌ట్టి)తో కృష్ణ ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టి నుంచి కృష్ణ జీవితం గంద‌ర‌గోళంగా మారుతుంది. ఆ క్ష‌ణం నుంచి కృష్ణ‌, రాధ‌ల ప్రే ఎలాంటి మ‌లుపులు తిరిగింది? .. రాధ‌, కృష్ణ ఈ ప్ర‌యాణంలో ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి? స‌త్య మ‌ళ్లీ కృష్ణ జీవితంలోకి ఎంట‌రైందా?  లేదా అన్న‌ది తెలుసుకోవాలంఏ ఈ ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీని చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:

మూడు పాత్ర‌ల నేప‌థ్యంలో సాగే ముక్కోణ ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. మూడు కీల‌క పాత్ర‌ల్లో సిద్ధు, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌, శాలిని వ‌డ్ని క‌ట్టి న‌టించారు. మ‌రో కీల‌క అతిథి పాత్ర‌లో సీర‌త్ క‌పూర్ న‌టించింది. ఈ న‌లుగురిలో సిద్ధు త‌న పాత్ర‌ని ఆశించిన స్థాయిలో ర‌క్తిక‌ట్టించాడు. ల‌వ‌ర్ పాత్ర‌లో శాలిని వ‌డ్ని క‌ట్టి త‌న వంతు పాత్ర‌కు న్యాయం చేసింది. ఇక ముందు ప్రేమించిన అమ్మాయిగా శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ బోల్డ్‌గా న‌టించి మ‌రోసారి ఆక‌ట్టుకుంది. శీర‌త్ క‌పూర్ కూడా త‌న పాత్ర మేర‌కు న‌టించి మెప్పించింది. యూట్యూబ్ స్టార్ వైవా హ‌ర్షా అక్క‌డ‌క్క‌డ‌ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు:

యంగేజింగ్ థ్రిల్ల‌ర్ `క్ష‌ణం`తో ఆక్టుకున్న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ పేరేపు ఈ ద‌ఫా రొమాంటిక్ ల‌వ్‌స్టోరీని ఎంచుకుని ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయాడు. ప్రేమించిన అమ్మాయిల్ని మోసం చేసే హీరో పాత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఆశించిన స్థాయిలో ద‌ర్శ‌కుడు మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడ‌ని చెప్పొచ్చు. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని జోడించి మ‌రింత అర్థ‌వంతంగా క‌థ‌ని రాసుకుని వుంటే ఫ‌లితం మ‌రోలా వుండేది. ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ అనేది పాత ఫార్ములానే అయినా కొంత వ‌ర‌కు మాత్ర‌మే మెప్పించ‌గ‌లిగింది. సినిమాటో గ్ర‌ఫీ చెప్పుకునే విధంగా వుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల నేప‌థ్య సంగీతం, పాట‌లు ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి.

విశ్లేష‌ణ‌:

`క్ష‌ణం` వంటి యంగేజింగ్ థ్రిల్ల‌ర్‌ని అందించిన ర‌వికాంత్ పేరేపు ద్వితీయ చిత్రంగా ఇలాంటి కాంప్లికేటెడ్ ల‌వ్ స్టోరీని అందిస్తాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌రు. హీరో పాత్ర‌ని చుట్టూ అల్లుకున్న క‌థ కావ‌డంతో దాన్ని మ‌రింత అర్థ‌వంతంగా రాసుకుని వుంటే బాగుండేది అనిపిస్తుంది. హీరో పాత్రిన మ‌రింత‌గా మార్చి దానికి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని జోడిస్తే సినిమా స్థాయి, ఫ‌లితం మ‌రోలా వుండేది. ఇక క‌థ‌, క‌థ‌నాల‌ని నిడిపించిన తీరు కూడా స్లోగా వుండి స‌గ‌టు ప్రేక్ష‌కుల‌డికి బోర్ కొట్టించేలా వుంది. థియేట‌ర్ అయినా ఓటీటీలో అయినా ఒక్క‌సారి చూడొచ్చు అనే విధింగా వుందే కానీ హుత్సాహంతో చూసే విధంగా మాత్రం లేదు.

రేటింగ్ : 2.5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All