Homeటాప్ స్టోరీస్మాస్ రాజా `క్రాక్` మూడో సాంగ్ వ‌చ్చేసింది!

మాస్ రాజా `క్రాక్` మూడో సాంగ్ వ‌చ్చేసింది!

మాస్ రాజా `క్రాక్` మూడో సాంగ్ వ‌చ్చేసింది!
మాస్ రాజా `క్రాక్` మూడో సాంగ్ వ‌చ్చేసింది!

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మూడేళ్ల విరామం త‌రువాత ఈ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. డాన్‌శీను, బ‌లుపు వంటి హిట్ చిత్రాల త‌రువాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్ర‌మిది. లాక్‌డౌన్ త‌రువాత షూటింగ్ పునః ప్రారంభ‌మైన ఈ చిత్రం ఇటీవ‌ల గోవాలో చిత్రీక‌రించిన చివ‌రి పాట‌తో చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యింది.

సంక్రాంతికి ఈ మూవీ రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ ప్ర‌మోష‌న్స్ మొద‌ల‌య్యాయి. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇప్ప‌టి వ‌రకు రెండు పాట‌ల్ని విడుద‌ల చేశారు. తాజాగా క్రిస్మ‌స్ సంద‌ర్భంగా మూడో పాట‌ని చిత్ర బృందం శుక్ర‌వారం విడుద‌ల చేసింది. `కోర మీసం పోలీసోడా.. అంటూ సాగే ఈ  రొమాంటిక్ మెలోడీని రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు. ర‌మ్యా బెహ‌రా త‌న సుమ‌ధుర గాత్రంతో ఈ పాట‌కు ప్రాణం పోసింది.

- Advertisement -

ర‌వితేజ‌ను టీజ్ చేస్తూ శృతిహాస‌న్ పాడే పాట‌గా ఈ పాట‌ని చిత్రీక‌రించారు. ఈ పాట‌లో శృతిహాస‌న్, ర‌వితేజ మ‌రింత రోమాంటిక్‌గా క‌నిపించారు. పాట‌లో హీరో ర‌వితేజ మీసాన్ని శృతిహాజ‌న్ త‌న కాలి మునివేళ్ల‌తో నెమ‌రేయ‌డం హైలైట్‌గా నిలుస్తోంది. ఫుల్ సాంగ్‌లో వీరిద్దరి రొమాన్స్ మ‌రింత హైలైట్‌గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All