Homeటాప్ స్టోరీస్ఆచార్య షూటింగ్ స్టేటస్ రివీల్ చేసిన కొరటాల శివ

ఆచార్య షూటింగ్ స్టేటస్ రివీల్ చేసిన కొరటాల శివ

ఆచార్య షూటింగ్ స్టేటస్ రివీల్ చేసిన కొరటాల శివ
ఆచార్య షూటింగ్ స్టేటస్ రివీల్ చేసిన కొరటాల శివ

సాధారణంగా కొరటాల శివ సినిమా చిత్రీకరణకు మరీ ఎక్కువ సమయం తీసుకోడు. అలాంటిది ఆచార్య మాత్రం రెండేళ్లుగా సాగుతోంది. దీనికి కరోనా కూడా అడ్డంకులు ఏర్పరిచింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆచార్య షూటింగ్ కు మళ్ళీ బ్రేకులు పడ్డాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి ఆచార్య విడుదలై పది రోజులు గడిచేది.

ఇంతకీ ఆచార్య షూటింగ్ స్టేటస్ ఏంటి? ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో కొరటాల శివ ఈ విషయమై స్పందించాడు. 2020 జనవరిలో ఆచార్య షూటింగ్ ను ప్రారంభించాం. అప్పుడు ఒక సాంగ్, కొన్ని సీన్లు చిత్రీకరించాం కానీ లాక్ డౌన్ కారణంగా ఏడాది అంతా షూటింగ్ జరగలేదు. మళ్ళీ ఏడాది చివరి నుండి షూటింగ్ మొదలుపెట్టాం.

- Advertisement -

ఈసారి ఏ అడ్డంకి లేకుండా నాలుగు నెలల పాటు షూటింగ్ చేసుకున్నాం. కరోనా సెకండ్ వేవ్ చర్చ వచ్చినప్పుడు కూడా షూటింగ్ చేసాం. కీలకమైన ఫారెస్ట్ షెడ్యూల్ చిత్రీకరించాం. అయితే తీవ్రత పెరిగిన దృష్ట్యా రిస్క్ తీసుకోకూడదు అనిపించింది. మరో 10 రోజులు పాటు షూటింగ్ చేసి ఉంటే టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యేది అని చెప్పుకొచ్చాడు శివ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All