Homeగాసిప్స్మెగా హీరోకి డెడ్‌లైన్ పెట్టిన స్టార్ డైరెక్ట‌ర్‌?

మెగా హీరోకి డెడ్‌లైన్ పెట్టిన స్టార్ డైరెక్ట‌ర్‌?

మెగా హీరోకి డెడ్‌లైన్ పెట్టిన స్టార్ డైరెక్ట‌ర్‌?
మెగా హీరోకి డెడ్‌లైన్ పెట్టిన స్టార్ డైరెక్ట‌ర్‌?

మెగా హీరోకి స్టార్ డైరెక్ట‌ర్ డెడ్‌లైన్ పెట్టేశారా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రంభీం పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌ర‌గుతోంది.

రామ్‌చ‌ర‌ణ్ బాలీవుడ్ నటి అలియా భట్‌తో ఒక పాటను, మరో సుదీర్ఘ యాక్షన్ సీక్వెన్స్‌ను రాబోయే నెలల్లో పూర్తి చేయాలి. అపూర్త‌యితే త‌న‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్త‌వుతుంది. ఇది పూర్త‌యితే గానీ రామ్‌చ‌ర‌ణ్ `ఆచార్య‌` మూవీకి డేట్స్ కేటాయించ‌లేని ప‌రిస్థితి. దీంతో ఈ `ఆర్ ఆర్ ఆర్‌` షూటింగ్‌ని మ‌రో రెండు నెల‌ల్లో పూర్తి చేసి ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రున కానీ మార్చి మొద‌టి వారంలో కానీ `ఆచార్య‌` సెట్‌లో అడుగుపెట్టాలనుకుంటున్నార‌ట‌.

- Advertisement -

ఇప్ప‌టికే `ఆచార్య‌` ని మే 7న రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించ‌డంతో ఎట్టిప‌రిస్థితుల్లోనూ రామ్‌చ‌ర‌ణ్ ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రున కానీ మార్చి మొద‌టి వారం నుంచి కానీ `ఆచార్య‌` సెట్‌లోకి రావాల్సిందేన‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ హీరో రామ్‌చ‌ర‌ణ్‌కు వివ‌రించిన‌ట్టు తెలిసింది. దీంతో రామ్‌చ‌ర‌ణ్ కూడా తొంద‌ర ప‌డుతున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All