Homeటాప్ స్టోరీస్మెగా సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్‌.. ప‌సుపు ఫంక్ష‌న్ హంగామా!

మెగా సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్‌.. ప‌సుపు ఫంక్ష‌న్ హంగామా!

మెగా సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్‌.. ప‌సుపు ఫంక్ష‌న్ హంగామా!
మెగా సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్‌.. ప‌సుపు ఫంక్ష‌న్ హంగామా!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇంట్లో మెగా సెల‌బ్రేష‌న్స్ మొద‌ల‌య్యాయి. ఆయ‌న గారాల ప‌ట్టి, హీరోయిన్ నిహారిక కొణిదెల వివాహం త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే అంగ‌రంగ వైభ‌వంగా ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌ప్ప ఈ వేడుక‌కి మెగా ఫ్యామిలీ అంతా హాజ‌రైంది. గుంటూరుకు చెందిన పోలీస్ అధికారి త‌న‌యుడు చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో నిహారిక వివాహం జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

పెళ్లికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మెగా ఫ్యామిలీ పెళ్లి ప‌నుల్లో బిజీగా మారిపోయింది. సోమ‌వారం ప‌సుపు దంచే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌వ వ‌ధువు కొణిదెల నిహారిక పెళ్లి శోభ‌తో కాంతులీనుతూ క‌నిపించి సంద‌డి చేసింది. నిహారిక‌తో క‌లిసి మెగా ఫ్యామిలీ అడ‌వాళ్లంతా పాల్గొని హంగామా చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో పాటు నిహారిక ఫ్రెండ్స్ కూడా సంద‌డి చేశారు.

- Advertisement -

ప‌సుపు దంచే కార్యక్ర‌మానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంత జ‌రుగుతున్నా వివాహ తేదీని మాత్రం మెగా ఫ్యామిలీ ఇంత వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. ఫైన‌ల్‌గా వెడ్డింగ్ కార్డ్‌తో పెళ్లి తేదీని ప్ర‌క‌టిస్తార‌ని అంతా భావిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో చాలా రోజుల త‌రువాత జ‌రుగుతున్న వివాహం కావ‌డంతో అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ హ‌డావిడీ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All