Homeటాప్ స్టోరీస్కొమరం భీం జయంతి రోజు అయితే! మొదటి లుక్ వస్తుంది అనుకున్నారా?

కొమరం భీం జయంతి రోజు అయితే! మొదటి లుక్ వస్తుంది అనుకున్నారా?

కొమరం భీం జయంతి రోజు అయితే! మొదటి లుక్ వస్తుంది అనుకున్నారా?
కొమరం భీం జయంతి రోజు అయితే! మొదటి లుక్ వస్తుంది అనుకున్నారా?

దర్శకధీరుడు ‘ఎస్.ఎస్. రాజమౌళి‘ గారి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. బాహుబలి సినిమాల తర్వాత వస్తున్న సినిమా కనుక జనాలకి బాగా ఆసక్తి ఉంటుంది, సినిమా నుండి ఒక్క పోస్టర్ బయటికి వచ్చినా అభిమనులకి పండగే.. అలా సంవత్సరం నుండి ఎదురుచూస్తున్నారు అభిమానులు. రాజమౌళి గారికి ఏమో సినిమాని సరైన సమయానికి విడుదల చెయ్యాలి అని ఉంటుంది కానీ పరిస్థితులు ఆయనని ఆపేస్తాయి.

అందుకే అలాంటి భయంతోనే మీడియా వారి ముందు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. ఒకవేళ అనుకున్నట్టే పరిస్థితులు సహకరించకపోతే ముందు గానే క్షమాపణలు చెప్పి ఇంకొక తేదీని ప్రకటిస్తారు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్.’ విషయంలో కూడా అదే జరుగుతుంది. షూటింగ్ కూడా అప్పుడప్పుడు జరుగుతుంది ఎక్కువ రోజులు ఎవరికి వారు నచ్చిన సెలవులు తీసుకుంటున్నారు. ఇందులో ‘జూ.ఎన్.టి.ఆర్ – కొమరం భీం’ గా ‘రామ్ చరణ్ – అల్లూరి సీత రామ రాజు’ గా నటిస్తున్నారు. హీరోలు ఇద్దరు తమ తమ గెట్ అప్ లోనే బయట కనిపిస్తున్నారు. జూ.ఎన్.టి.ఆర్ గెట్ అప్ మాత్రం కొంచెం రహస్యంగానే దాచేస్తున్నారు రాజమౌళి గారు. పైగా ఈ రోజు కొమరం భీం గారి జయంతి సందర్భంగా ‘జూ.ఎన్.టి.ఆర్ – కొమరం భీం’ గా ఉన్న ఫోటో ఒకటి విడుదల చేస్తారు ఈ రోజు అని ఎదురుచూస్తున్న అభిమనులకి నిరాశ ఎదురైంది.

- Advertisement -

కారణం ఎస్.ఎస్. రాజమౌళి గారు ఇప్పుడు లండన్ లో ఉన్నారు. బాహుబలి సినిమాలో భాగస్వామ్యం అయిన వారిలో ఒక తమన్నా తప్ప మిగిలిన వారు అందరూ రాయల్ అల్బర్ థియేటర్ లో బాహుబలి సినిమా ప్రదర్శనని చూస్తూ అలాగే సినిమాలోని  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను లైవ్ ఆర్కెస్ట్రాతో వినిపిస్తున్నారు లండన్ వారికి. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ రోజు ఏదోఒక న్యూస్ బయటికి వస్తుంది అనుకున్న వారి ఆశల మీద ఎస్.ఎస్. రాజమౌళి గారు నీరు పోసారు. ఎందుకంటే ఎస్.ఎస్. రాజమౌళి గారు తిరిగి రావడానికి ఇంకా 10 రోజుల సమయం పట్టేలా ఉంది. మరి ఇంకా ఎలా విడుదల చేస్తారు ఫోటో ని?

అలా ‘జూ.ఎన్.టి.ఆర్’ గారి అభిమానులు ఎదురుచూస్తున్న మొదటి పోస్టర్ ఈ రోజు రాలేదు అని కొంత బాధ గానే ఉన్నారు. జూ.ఎన్.టి.ఆర్ గారి అభిమానులు వారికి వారే కొత్తగా జూ.ఎన్.టి.ఆర్ గారి పాత సినిమాలోని ఏదోఒక ఫోటో తీసుకొని వాటిని ఎడిట్ చేసి మాద్యమాల్లో పెడుతూ ఉన్నారు. కొంతమంది అయితే అవే నిజం అనుకోని షేరింగ్ కూడా చేసేస్తున్నారు. అలా జూ.ఎన్.టి.ఆర్ గారి మీద వారికి ఉన్న పిచ్చి ప్రేమని అలా వాడుకుంటున్నారు. సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని, అలియా భట్ ఇంకా కొంతమంది నటిస్తున్నారు. వారి పేర్లు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు రాజమౌళి గారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All