Homeటాప్ స్టోరీస్బాహుబలి, సైరా మధ్య తేడా అదేగా!

బాహుబలి, సైరా మధ్య తేడా అదేగా!

Baahubali-and-Sye-Raa-Narasimha-Reddy
Baahubali-and-Sye-Raa-Narasimha-Reddy

రాజమౌళి ఎందుకంత ప్రత్యేకమైన దర్శకుడు అని ఎవరికైనా డౌట్ వస్తే ఆయన సినిమాలు చూస్తే చాలు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. తన సినిమాల్లో కచ్చితంగా ఫైట్స్ ఉండేలా చూసుకుంటాడు. ప్రతి 20 నిమిషాలకు ఒక హై పాయింట్ ఇచ్చేలా జాగ్రత్తపడతాడు. మొత్తానికి ప్రేక్షకులకి రోమాలు నిక్కబొడుచుకునే ఎక్స్పీరియన్స్ ఇస్తాడు.

బాహుబలి సిరీస్ విషయంలోనూ రాజమౌళి ప్రత్యేకత కనిపిస్తుంది.దీనికి యూనివర్సల్ అప్పీల్ తీసుకురావడానికి ఒక కల్పిత కథను తీసుకుని మాహిష్మతి రాజ్యాన్ని సృష్టించాడు. తెలుగు వాళ్ళు చూస్తే ఇది తెలుగు వాళ్ళ కథలా, హిందీ వాళ్ళు చూస్తే హిందీ వాళ్ళ కథలా.. ఇలా ఏ భాష వాళ్ళు చూస్తే ఆ భాషలా అనిపించి నేటివిటీ ఫ్యాక్టర్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఆ కనెక్టివిటీ ఫ్యాక్టర్ వల్లే బాహుబలి అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది.

- Advertisement -

ఇక సైరా విషయానికి వస్తే బాహుబలి రేంజ్ లోనే ఎలివేషన్లు రాసుకున్నాడు. అది చూసినప్పుడు ప్రేక్షకుడు కూడా ఎంగేజ్ అవుతాడు. తెలుగు ప్రేక్షకుల వరకూ సైరా ఒక అద్భుతమైన ఫీల్ ను ఇస్తుంది. కానీ మిగిలిన భాషల వాళ్లకు మాత్రం నేటివిటీ ఫ్యాక్టర్ అడ్డుగా నిలుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేయలేదు. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నరసింహారెడ్డి పోరాటం గొప్పదే, విరోచితమైనదే.. కానీ అది ఒక ప్రాంతానికి చెందినది. అందుకే సైరా హిందీ వాళ్ళను మెప్పించలేకపోయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All