
కొబ్బరిమట్ట రివ్యూ:
నటీనటులు : సంపూర్ణేష్ బాబు , ఇషికా సింగ్ , షకీలా
సంగీతం : సయీద్ కమ్రాన్
నిర్మాత :సాయి రాజేష్ నీలం
దర్శకత్వం : రోనాల్డ్ రూపక్ సన్
రేటింగ్ : 3/ 5
విడుదల : 10 ఆగస్టు 2019
హృదయ కాలేయం చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన సంపూర్ణేష్ బాబు మళ్ళీ కొబ్బరిమట్ట అంటూ వచ్చాడు . మరి ఈ కొబ్బరిమట్ట చిత్రంతో ఆకట్టుకున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .
కథ :
రాయుడు ( సంపూర్ణేష్ బాబు ) తన గ్రామానికి పెద్ద దిక్కుగా ఉంటాడు , అతడికి ముగ్గురు భార్యలు దాంతో ఆ ముగ్గురు భార్యలతో సంతోషంగా ఉంటున్న రాయుడుకి ఆండ్రాయుడు ( సంపూర్ణేష్ బాబు ) రూపంలో కష్టాలు వచ్చి పడతాయి . అసలు ఆండ్రాయుడు ఎవరు ? ఎందుకు రాయుడి ని టార్గెట్ చేసాడు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
హైలెట్స్ :
సంపూర్ణేష్ బాబు
డైలాగ్స్
పేరడీ కామెడీ
డ్రా బ్యాక్స్ :
నో లాజిక్
నటీనటుల ప్రతిభ :
సంపూర్ణేష్ బాబు వన్ మ్యాన్ షో గా సాగింది కొబ్బరిమట్ట . పాపారాయుడు , పెదరాయుడు , ఆండ్రాయుడు ఇలా మూడు పాత్రల్లో తనదైన టైమింగ్ తో విశేషంగా అలరించాడు. సంపూర్ణేష్ బాబు డైలాగ్స్ చెబుతుంటే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతు ఉండిపోయారంటే సంపూ కి ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో యిట్టె అర్ధం చేసుకోవచ్చు . కత్తి మహేష్ సెటైరికల్ డైలాగ్స్ బాగానే పేలాయి . షకీలా నటిగా అలరించింది . ఇంకా ఈ చిత్రంలో పెద్ద మొత్తంలోనే నటీనటులు ఉన్నారు కానీ తన నటనతో అందరినీ పక్కకు నెట్టేశాడు సంపూ .
సాంకేతిక వర్గం :
స్టీవ్ శంకర్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి , ప్రేక్షకుల్ని నవ్వించాయి , నేపథ్య సంగీతం తో పాటుగా పాటలు కూడా అలరించేలా ఉన్నాయి . ఇక విజువల్స్ కూడా బాగున్నాయి . సాయి రాజేష్ నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు రోనాల్డ్ రూపక్ సన్ విషయానికి వస్తే కొబ్బరిమట్ట ని సెటైరికల్ కామెడీ కోరుకునే ప్రేక్షకులకు బాగా నచ్చేలా తీర్చి దిద్దాడని చెప్పొచ్చు అయితే సంపూ కామెడీ ని ఇష్టపడని వాళ్లకు మాత్రం అంతగా నచ్చకపోవచ్చు .
ఓవరాల్ గా :
నవ్వుకోవడానికి తప్పకుండా ఓసారి చూడొచ్చు
Click Here: Kobbari Matta Movie Review in English