Homeటాప్ స్టోరీస్వీడు హీరో ఏంటి అని చాలా మంది విమర్శించారు.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు

వీడు హీరో ఏంటి అని చాలా మంది విమర్శించారు.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు

sampurnesh babu interview
sampurnesh babu interview

‘హృదయ కాలేయం’ చిత్రంతో ఓవర్ నైట్ యూట్యూబ్ స్టార్ అయి నటుడిగా మంచి గుర్తింపుపొందారు బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు. సంపూ చెప్పే ఫుల్ లెంగ్త్ డైలాగ్స్, ఆయన యాక్టింగ్ కి ప్రత్యేకమైన అభిమానులు వున్నారంటే అతిశయోక్తి కాదు.
అంతలా క్రేజ్ని, పాపులారిటీని సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం ‘కొబ్బరి మట్ట‘ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శక‌త్వంలో వల్లమ్ సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలో బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మూడు పాత్ర‌లు వేయ‌ట‌మే కాకుండా అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డు ని నెల‌కొల్పాడు..

- Advertisement -

పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు లాంటి అత్య‌ద్బుత‌మైన మూడు పాత్ర‌ల‌తో మెప్పించ‌బోతున్నారు బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు. ఈ చిత్రం ఈనెల10న గ్రాండ్ గా విడుదలకానుంది. రిలీజ్ కి ముందే ఇండస్ట్రీలో హిట్ టాక్ ని సంపాదించుకున్న ఈ చిత్రం పై సంపూర్ణేష్ బాబు కాన్ఫిడెంట్ గా వున్నారు. ఈ సందర్భంగా బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబుని
ఇంటర్వ్యూ చేసినపుడు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.. ఆ విశేషాలు మీకోసం..

ఈ చిత్రంలో మీరు ఆగకుండా లెన్తీ డైలాగ్ చెప్పారు కదా.. కష్టంగా అనిపించిందా?

– అవునండి! ఆ డైలాగ్ చెప్పడానికి చాలా ప్రాక్టీస్ చేశాను. డైరెక్టర్ నాకు డైలాగ్ పంపి ప్రిపేర్ కామన్నారు. ఏడు నిమిషాల డైలాగ్ ని మూడున్నర నిమిషాలలో పూర్తిచేయాలి. పదో తరగతి పిల్లాడు పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు మొత్తం డైలాగ్ బట్టీపట్టాను.
మొత్తనికి ఎలాగోలా బట్టి పట్టి డైలాగ్ చెప్పాను. ఆ డైలాగ్ చెప్పగానే మోహన్ బాబు గారు ఆ వీడియో చూసి వెంటనే ఫోన్ చేసి అభినందించారు. అలాగే ఇండస్ట్రీ నుండి చాలా అప్లాజ్ వచ్చింది. మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఫోన్ చేసి
అభినందించారు.

‘కొబ్బరిమట్ట’ విడుదల విషయంలో జాప్యం జరగటానికి రీసన్ ఏంటి ?
– ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావలసింది. ‘హృదయకాలేయం’ సినిమా విడుదల సమయంలోనే ఈ చిత్ర పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఆలస్యం కావడానికి అనేక కారణాలున్నాయి, మేము అనుకున్న బడ్జెట్ పరిమితి దాటిపోవడం,
మూడు వైవిధ్యమైన పాత్రలు కావడంతో షూటింగ్ డేస్ కూడా పెరగడం జరిగింది. ఆరుగురు భార్యలు, నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు చెల్లెల్లు వంటి భారీ కాస్ట్ వలన, నేను బిగ్ బాస్ షో కి వెళ్లడం, నటుల డేట్స్ కుదరకపోవడం వలన ఇలా అనేక
కారణాల వలన మూవీ ఆలస్యం అయ్యింది. అంతే కానీ వేరే రీసన్ అంటూ ఏం లేదు.. ఇప్పుడు గీత ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ ద్వారా రిలీజ్ కావడం చాలా హ్యాపీగా వుంది.

ఈ చిత్రంలో మీరు మూడు వైవిధ్యమైన పత్రాలు చేసారని తెలిసింది?
-అవునండీ..! పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ వంటి మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించాను. ఇవి నేను చేయగలనా అని మొదట్లో చాలా కష్టం అనిపించింది. పొద్దున్నే పెదరాయుడు గెటప్ ఉండేది. మధ్యాహ్నానికి పాపారాయుడు గెటప్
కోసం గమ్ పూసేవారు. వెంటనే సాయంత్రానికి ఆండ్రాయిడ్ గెటప్ కోసం మళ్ళీకాస్ట్యూమ్స్ చేంజ్ చేసేవారు. అయినా కెరీర్ స్టార్టింగ్ లోనే మూడు విభిన్న పాత్రలు చేసే అవకాశం రావడంతో ఇష్టంగానే చేశాను. దర్శకుడు రూపక్, నిర్మాత సాయి రాజేష్
ఎంతో కేర్ తీసుకొని ఈ చిత్రం చేసారు. వారివల్లే ఈ సినిమా బాగా వచ్చింది.

టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి ?
– ఇప్పటికే మావిడాకులు, గోరింటాకు అనే టైటిల్స్ తో సినిమాలు వచ్చాయి. ఏదైనా ఓ పెద్ద ఆకు పేరు పెడితే బాగుంటుందని అనుకున్నాం.. మనకు ఉన్నదాంట్లో “కొబ్బరిమట్ట” అని పెట్టాం.. కథకి యాప్ట్ టైటిల్ ఇది. సినిమా చూస్తే ఈ టైటిల్ ఎందుకు
పెట్టామో తెలుస్తుంది.

మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?

– నాకు చిన్నప్పటినుండి సినిమాలపై ఆసక్తి ఉండేది. మావూరు కరీంనగర్ మిట్టపల్లిలో నాటకాలు వేసే వాడిని . నేను సినిమాపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దర్శకుడు స్టీవ్ శంకర్ నన్నుచూసి, నేను ఓ వరస్ట్ హీరో కోసం
చూస్తున్నాను. అది నువ్వే అన్నారు. అలా హృదయ కాలేయం లో హీరో ఐపోయాను.

హృదయకాలేయం తరువాత అనేక విమర్శలు వచ్చినట్లున్నాయి?
– అవును అప్పట్లో వీడేంటి, హీరో ఏంటి అని చాలా మంది విమర్శించారు. కొందరైతే ఫోన్ చేసి మరి తిట్టేవారు. హీరో ఐతే ఇన్ని అవమానాలు భరించాలా అనిపించేది. రాజమౌళి గారు పాజిటివ్ గా ఒక ట్వీట్ చేశాక కొంచెం తగ్గింది. అప్పటినుడి అందరూ
కొంచెం అభిమానిస్తున్నారు.

ఈ సినిమా ఆగిపోతుందని తెలిసినప్పుడు వేరే సినిమాలలో ఎందుకు నటించలేదు?
– ఎక్కడో మిట్టపల్లి లాంటి చిన్న పల్లెటూరికి చెందిన నన్ను, హీరో చేసిన వ్యక్తి స్టీవ్ శంకర్. అలాంటి వ్యక్తి ఈ చిత్రం కోసం నిర్మాతగా కూడా మారాడు. ఆయనకోసమైనా ఈ చిత్రం విడుదలైయ్యేలా నా వంతు ప్రయత్నం చేశాను. అందుకనే ఏ సినిమాలోనూ
నటించలేదు.. చాలా ఆఫర్స్ వచ్చాయి.. అన్నింటినీ వదులుకున్నాను.

ఈ మధ్య కాలంలో ఒక పెద్ద డైరెక్టర్ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని వార్తలు వినిపించాయి?
– అవునండీ. పూరి జగన్నాధ్ సినిమాలో మంచి క్యారెక్టర్ కోసం ఆ టీం నన్ను సంప్రదించడం జరిగింది. అయితే అదే సమయం లో కొబ్బరి మట్ట షూటింగ్ ఉండడంతో వీలు కాలేదు. అయితే తరువాత ఎలాంటి కోపం లేకుండా పూరి గారు మా సినిమా
సాంగ్ ని రిలీజ్ చేయడం హ్యాపీ గా అనిపించింది. ఆయన పిలిస్తే ఎప్పటికైనా సినిమా చేస్తాను.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– ఇద్దరు నిర్మాతలు వారి సినిమాల కోసం అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా లేట్ కావడంతో వారు నన్ను సంప్రదించలేదు. అయితే కొబ్బరి మట్ట సినిమా నా కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మిగతా వాటి గురించి
ఆలోచిస్తా అంటూ ఇంటర్వ్యూ ముగించారు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All