Homeగాసిప్స్అన్ని సినిమాలూ కేజిఎఫ్ కాలేవుగా సుదీప్

అన్ని సినిమాలూ కేజిఎఫ్ కాలేవుగా సుదీప్

Sudeep
అన్ని సినిమాలూ కేజిఎఫ్ కాలేవుగా సుదీప్

అద్భుతం అంటే మనం అనుకుని చేస్తే అవ్వదు. దానంతట అది జరగాలంతే. కన్నడ చిత్రం కేజిఎఫ్ కు సరిగ్గా అదే జరిగింది. సాధారణంగా కన్నడ సినిమాలు వేరే భాషల్లోకి అనువాదమవ్వవు. అలాంటిది కేజిఎఫ్ డబ్ అవ్వడమే కాకుండా హిందీ, తెలుగుల్లో దుమ్ము రేపింది. కేజిఎఫ్ ఇంతగా జనాలకు ఎక్కేయడానికి కారణమేమిటి అన్న ప్రశ్న వేసుకుంటే ప్రధానంగా వచ్చే సమాధానం హీరో ఎలివేషన్లు. నిజమే కేజిఎఫ్ లో హీరో ఎలివేషన్లు మాములుగా ఉండవు. రోమాలు నిక్కబొడుచుకునేలా తీర్చిదిద్దాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

అయితే కేవలం హీరో హీరో ఎలివేషన్ల వల్లే సినిమా ఆడేసిందా అంటే అది కూడా కాదు. కేజిఎఫ్ లో ముఖ్యంగా ఎమోషన్ జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. కోలార్ బంగారు గనుల సెటప్ ప్రత్యేకంగా కనిపించింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే కేజిఎఫ్ అద్భుతం చేయగలిగింది. అయితే మనకు బాహుబలి చేసినట్లు, కన్నడ సినిమాకు కేజిఎఫ్ బయటి మార్కెట్లకు దారి చూపించింది.

- Advertisement -

దారి కనపడింది కదా అని చెప్పి భారీ బడ్జెట్, ఊర మాస్ హీరో ఎలివేషన్లు పెట్టుకుని సినిమా తీసేస్తే ఇటీవలే సుదీప్ నటించిన పహిల్వాన్ సినిమాలా తయారవుతుంది పరిస్థితి. కన్నడలో ఈ సినిమా సంగతి ఏమో కానీ మిగతా భాషలలో ఈ సినిమాను ఎందుకు విడుదల చేసారో నిర్మాతలకే తెలియాలి. ఏ మాత్రం అర్ధం లేని కథాకథనాలతో వచ్చిన పహిల్వాన్ ఊర మాస్ హీరో ఎలివేషన్లపైనే ఆధారపడింది. అందుకే కన్నడ తప్ప అన్ని చోట్లా సుదీప్ సినిమాకు తిరస్కారమే ఎదురైంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All