Homeటాప్ స్టోరీస్ఇంతకీ ఖైదీని హిట్ అనొచ్చా?

ఇంతకీ ఖైదీని హిట్ అనొచ్చా?

ఇంతకీ ఖైదీని హిట్ అనొచ్చా?
ఇంతకీ ఖైదీని హిట్ అనొచ్చా?

తన కెరీర్ లో వెరైటీ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చే కార్తీ, ఖైదీ చిత్రం ద్వారా పూర్తి ఆఫ్ బీట్ సినిమాను ఎంచుకున్నాడు. ఈ చిత్రం కన్వెన్షనల్ గా తెరకెక్కే సినిమాలకు పూర్తి భిన్నంగా తెరకెక్కింది. అటు సినిమాలో హీరోయిన్ ఉండదు, ఇటు పాటలంటూ ఏం ఉండవు. పైగా సినిమా అంతా ఒక్క రాత్రిలో పూర్తైపోతుంది. ఇలా కమర్షియల్ అంశాలు అని చెప్పుకోదగ్గ వాటికి చాలా దూరంగా తెరకెక్కిన ఖైదీ మొదట మంచి టాక్ నే సొంతం చేసుకుంది. వసూళ్లు మొదట్లో కొంత నెమ్మదించినా తర్వాత పుంజుకున్నాయి. రీసెంట్ కాలంలో తెలుగులో హిట్ ఏంటి అంటే ఖైదీ అని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో డబ్బింగ్ సినిమాలకు తెలుగులో అంత ఆదరణ దక్కట్లేదు. వచ్చిన సినిమా వచ్చినట్లే పోతోంది. అది ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ఇదివరకటిలా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదవ్వట్లేదు. ఈ నేపథ్యంలో తెలుగులో ఒక డబ్బింగ్ సినిమా హిట్ అవ్వడం అంటే విశేషమే. ఇంతకీ ఖైదీ హిట్ అంటున్నారు కానీ అది ఏ రేంజ్ హిట్? ఇది హిట్ తో ఆగిపోయిందా లేక బ్లాక్ బస్టర్ స్థాయికి ఎదిగిందా వంటి విషయాలను ఒకసారి చూద్దాం.

ఖైదీ సినిమా మూడు వారాల్లో 8.20 కోట్ల షేర్ వసూలు చేసింది. గ్రాస్ గా చూసుకుంటే వసూళ్లు ఇంకా ఎక్కువే ఉన్నా కూడా తెలుగు వరకూ షేర్ కే ప్రాధాన్యత ఎక్కువ. అసలు డిస్ట్రిబ్యూటర్ కు మిగిలేది కూడా ఇదే కాబట్టి షేర్ నే పరిగణలోకి తీసుకుందాం. 8.20 కోట్ల షేర్ వసూలు చేసిందంటే ఈ చిత్రం దాదాపుగా తెలుగు 3.20 కోట్ల ప్రాఫిట్ ను ఇప్పటికే అందుకుంది. ఎందుకంటే తెలుగులో ఈ సినిమా కేవలం 5 కోట్లకు బిజినెస్ చేసింది. కార్తీ మార్కెట్ తెలుగులో డౌన్ అవ్వడం, డబ్బింగ్ సినిమాలకు ఆదరణ తగ్గడంతో తక్కువ మొత్తానికే తెలుగు హక్కుల్ని అమ్మేసారు. అయితే ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూటర్ కు కాసులు పండించింది. ఒక్కసారి ఏరియా వైజ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ చూద్దాం.

- Advertisement -

ప్రాంతం షేర్ (కోట్లలో)

నైజాం- 2.98 కోట్లు

సీడెడ్ -1.28 కోట్లు

ఉత్తరాంధ్ర-1.17కోట్లు

తూ.గో జిల్లా-63లక్షలు

ప.గో జిల్లా-43లక్షలు

గుంటూరు -55లక్షలు

కృష్ణ-77లక్షలు

నెల్లూరు-39లక్షలు

మొత్తంగా-8.20 కోట్లు

ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఖైదీ వసూళ్లతో ప్రభంజనాన్నే సృష్టించింది. కేవలం 28.30 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసిన ఖైదీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 52 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే దాదాపు డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడికి అంతే రేంజ్ ప్రాఫిట్స్ వచ్చాయన్నమాట. ఈ మధ్య కాలంలో ఇలా బయ్యర్లందరూ హ్యాపీగా డబ్బులు వెనకేసుకున్న సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం ఇంకా ఫుల్ రన్ కు రాకపోవడం విశేషం. నాలుగో వారంలో ఇంకా స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. పోటీగా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం, వచ్చిన సినిమాల్లో పస లేకపోవడంతో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఖైదీ ఫస్ట్ ఛాయస్ అవుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All