HomeVideosKGF 2 ట్రైలర్ రిలీజ్

KGF 2 ట్రైలర్ రిలీజ్

KGF Chapter 2 Trailer
KGF Chapter 2 Trailer

యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న kGF 2 ట్రైలర్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యాష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ట్రైలర్ ను ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి మరింత ఆసక్తి నింపారు. కేజీఎఫ్ సినిమా ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్… హీరో యష్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నారు. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది.

ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ లలో భాగంగా ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ట్రైలర్ ప్రేక్షకులకు గూస్‏బంప్స్ తెప్పించేలా విజువల్స్ ఉండడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోసారి యష్ నటనతో అదరగొట్టాడు.. రక్తంతో రాసిన కథ ఇది.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేము అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకోంటున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All