
కన్నడ హీరో యాష్ – ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన కేజీఎఫ్ మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలియంది కాదు..అన్ని భాషల్లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు త్వరలో దీనికి సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే ఈ సీక్వెల్ తాలూకా ప్రమోషన్ మొదలుపెట్టగా.. ‘తూఫాన్ తేఫాన్..’ అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేసి ఆకట్టుకున్నారు.
ఓ వ్యక్తి రాఖీభాయ్ గురించి చెబుతున్న మాటలతో ‘తూఫాన్ తేఫాన్..’ లిరికల్ వీడియో మొదలైంది. ‘జల్లోడపడితే ఒక్కడు కూడా నిలబడడు.. ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు.. వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్ అనే డైలాగ్ లతో లిరికల్ వీడియో మొదలై ఆసక్తికరమైన పదాలతో సాగుతూ ఆకట్టుకుంటోంది. రవి బాసుర్రూర్ సంగీతం అందించిన ఈ పాట రోమాంచితంగా వుంది. రామజోగయ్య శాస్త్రి రచన చేసిన ఈ పాటని సాయికృష్ణ పృథ్వీ చంద్రతో పాటు దాదాను పది మంది గాయకులు ఆలపించారు.