HomeVideosకేజీఎఫ్‌ 2 నుండి మదర్‌ సాంగ్‌ రిలీజ్

కేజీఎఫ్‌ 2 నుండి మదర్‌ సాంగ్‌ రిలీజ్

KGf 2 mother song released
KGf 2 mother song released

యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం kGF 2 . ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యాష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ప్రమోషన్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. కేజీఎఫ్ సినిమా ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దానికి రెట్టింపులా ఈ సెకండ్ పార్ట్ ఉండబోతుందని తాజాగా విడుదలైన ట్రైలర్ చెప్పకనే చెపుతుంది. ఏప్రిల్ 14 న ఈ మూవీ రిలీజ్ కాబోతుండడం తో కేజీఎఫ్‌ 2 సినిమాలో మదర్‌ సాంగ్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఎదగరా.. ఎదగరా అనే లిరిక్స్‌ తో.. ప్రారంభం అయ్యే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. కేజీఎఫ్‌ 1 లోని బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజికే ఈ పాటకు జోడించడంతో.. అందరి మనసులు దోచుకుంటోంది.

కన్నడ, హిందీ, తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో కూడా రిలీజ్ కానున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడగా, ఆ అంచనాలను మరో రేంజ్‌లో పెంచేందుకు ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ ను తక్కువ టికెట్ ధరలతో ముందుగానే రీ రిలీజ్ చేయబోతున్నారు. నేటి నుంచి బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్స్‌లో ఏప్రిల్ 13 వరకు ప్రదర్శించనుండగా, 14న చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All