Homeటాప్ స్టోరీస్ప్రభాస్ విషయంలో తప్పుజరిగింది

ప్రభాస్ విషయంలో తప్పుజరిగింది

kerala minister kadampally surendran slams malayala starsకేరళలో భారీ వరదలతో , వర్షాలతో అతలాకుతలం అయిన విషయం తెలిసిందే . కనీవినీ ఎరుగని రీతిలో కేరళ నష్టపోవడంతో దేశ వ్యాప్తంగా పెద్దసంఖ్యలో స్పందించి అందరూ సహాయం చేస్తున్నారు అలాగే సినీ ప్రముఖులు కూడా . ఉత్తరాది సినీ ప్రముఖుల కంటే దక్షిణాది సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో సహాయం అందించారు . అయితే మలయాళ స్టార్ హీరోలు మాత్రం తక్కువ మొత్తం మాత్రమే విరాళంగా ఇచ్చారు దాంతో కేరళ పర్యాటక శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మలయాళ హీరోలపై ఆగ్రహం వ్యక్తం చేసాడు . మీకంటే తెలుగు హీరో ప్రభాస్ చాలా బెటర్ అతడు కోటి రూపాయలు విరాళం ఇచ్చాడని వేదిక పైనే అన్నాడు .

అయితే ప్రభాస్ కేరళ బాధితుల సహాయార్థం ఇచ్చింది 25 లక్షలు మాత్రమే ! అయితే పొరపాటు వల్ల ప్రభాస్ విషయంలో తొందరపడి కోటి రూపాయల విరాళం ఇచ్చినట్లుగా ప్రకటించాడు కేరళ మంత్రి . అలాగే పనిలో పనిగా మలయాళ స్టార్ హీరోలను ఉతికి ఆరేసాడు . కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకునే మీరు ఇలాగేనా స్పందించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు . నిజమే ! మలయాళ చిత్ర పరిశ్రమలో చాలామంది స్టార్స్ ఉన్నారు కానీ విరాళాల విషయంలో మాత్రం అనుకున్న స్థాయిలో స్పందించడం లేదు . తక్కువ మొత్తమే విరాళం ఇచ్చారు మరి .

- Advertisement -

English Title: kerala minister kadakampally surendran slams malayala stars

Image result for Kerala minister kadakampally surendran slams malayala stars

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All