Sunday, August 14, 2022
Homeటాప్ స్టోరీస్ప్రభాస్ కొత్త సినిమా ఓపెనింగ్ ఆరోజేనట

ప్రభాస్ కొత్త సినిమా ఓపెనింగ్ ఆరోజేనట

prabhas and jil radhakrishna movie opening on september 6thయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . యువ దర్శకులు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది . అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహో చిత్రాన్ని తెలుగు , తమిళ్ , హిందీ బాషలలో నిర్మిస్తున్నారు . కాగా ఆ సినిమా పూర్తికాకుండానే జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రాన్ని పట్టాలెక్కించడానికి సమాయత్తం అవుతున్నాడు ప్రభాస్ . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 6న మంచి ముహూర్తం ఉండటంతో ఆరోజు ప్రభాస్ – జిల్ రాధాకృష్ణ ల కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుందని తెలుస్తోంది .

- Advertisement -

ప్రేమ కథకు యాక్షన్ ని జోడించి స్క్రిప్ట్ రూపొందించినట్లు తెలుస్తోంది , జిల్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణకు ఇది గోల్డెన్ ఛాన్స్ ఎందుకంటే జిల్ సినిమా ప్లాప్ అయినప్పటికీ ప్రభాస్ కు నచ్చడంతో ఛాన్స్ ఇచ్చాడు . యూరప్ లో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించనుంది . బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరగడంతో తెలుగులోనే కాకుండా తమిళ హిందీ బాషలలో కూడా ఏకకాలంలో రూపొందిస్తున్నారు ప్రభాస్ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి .

English Title: prabhas and jil radhakrishna movie opening on september 6th

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts