
తెలుగులో డిజిటల్ ప్లాట్ ఫామ్స్, వెబ్ సిరీస్‌ల సంప్రదాయం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తెలుగులో వెబ్ సిరీస్‌లని ప్రోత్సహించాలని ప్రయత్నాలు చేస్తే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దారుణంగా దెబ్బతీయడం, కాకి లెక్కలతో భారీగా నొక్కేయడంతో తెలుగు వాళ్లతో వెబ్ సిరీస్ అంటే నెట్ ఫ్లిక్స్ వారు భయపడిపోతున్నారు. ఇలాంటి వాతావరణంలో కొత్తగా పుట్టుకొచ్చింది `ఆహా`. అల్లు అరవింద్ ప్రారంభించిన ఈ డిజిటల్ ప్లాట్ ఫాం ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కారణంగా సంచలనం సృష్టిస్తోంది.
అదే `మస్తీ`. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ దర్శకుడు క్రిష్‌నే. నవదీప్, హెబ్బా పటేల్. చాందినీ చౌదరి, రాజా కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఇటీవలే అహా యాప్‌లో రిలీజ్ అయింది. పెళ్లైన తరువాత కూడా మరో అమ్మాయితో ప్రేమాయణాన్ని సాగించే యువకుడిగా నవదీప్ ఇందులో కనిపించాడు. చాందినీ చౌదరి ఇందులో నవదీప్‌కు లవర్‌గా నటించింది. బాలీవుడ్‌లో ఎరోటిక్ వెబ్ సిరీస్‌లకు కేరాఫ్ అడ్రస్ ఆల్ట్ బాలాజీ. దాన్నే మించిపోయేలా `మస్తీ` ఎపిసోడ్స్ వున్నాయి.
ఇందులోని ఓ సన్నివేశంలో చాందినీ చౌదరిని నవదీప్ కిస్ చేసే దృశ్యం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. సినిమాల్లో హద్దుల్లో నటించిన చాందిని `మస్తీ` వెబ్ సిరీస్‌లో ఇలా హద్దులు దాటి హాట్ హాట్ సన్నివేశాల్లో నటించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.