Homeటాప్ స్టోరీస్చిరు సినిమాను సైన్ చేసిన మహేష్ హీరోయిన్

చిరు సినిమాను సైన్ చేసిన మహేష్ హీరోయిన్

చిరు సినిమాను సైన్ చేసిన మహేష్ హీరోయిన్
చిరు సినిమాను సైన్ చేసిన మహేష్ హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రం కాకుండా కీర్తి తెలుగులో నటించే చిత్రం ఏది? దీనికి ఇప్పుడు సమాధానం దొరికింది. కీర్తి సురేష్ చిరంజీవి సినిమాను సైన్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో చిరు చెల్లెలి పాత్రలో కీర్తి కనిపించనుంది. ముందుగా ఈ పాత్ర కోసం సాయి పల్లవిని అనుకున్నారు కానీ చివరికి కీర్తి ఫైనల్ అయింది. ఈ పాత్ర కోసం కీర్తి భారీ రెమ్యునరేషన్ ను తీసుకుంటోందని సమాచారం. అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతోంది.

- Advertisement -

ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ ను మొదలుపెట్టనున్నాడు చిరంజీవి. దీంతో పాటు కీర్తి సురేష్ మరో భారీ తెలుగు సినిమాను కూడా సైన్ చేయనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All