
కీర్తిసురేష్ `మహానటి` మూవీతో నటిగా తన సత్తా ఏంటో జాతీయ స్థాయిలో నిరూపించుకుంది. అయితే కంటెంట్ లోపం వల్ల ఆ తరువాత ఆమె నటించిన మహిళా ప్రధాన చిత్రాలు పెంగ్విన్, మిస్ ఇండియా ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక ఫ్లాప్‌లుగా నిలిచాయి. లాక్‌డౌన్ సమయంలో విడుదలై ఈ రెండు చిత్రాల తరువాత కీర్తిసురేష్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తోంది.
నితిన్‌తో `రంగ్ దే`, మహేష్ నటిస్తున్న `సర్కారి వారి పాట` చిత్రాలు చేస్తోంది. ఈ మూవీస్‌తో పాటు మరో తమిళ చిత్రాన్ని అంగీకరించింది. 7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థారే వేరులే, యుగాని ఒక్కడు ఫేమ్ సెల్వరాఘవన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. `సాని కాయిదమ్` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కిస్తున్నారు.
బందిపోటు దొంగల కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1980ల కాలం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కీర్తి సురేష్, సెల్వరాఘవన్ బందిపోటు దొంగలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో కీర్తిసురేష్ మేకోవర్ షాకిస్తోంది. పక్కా పల్లెటూరి అమ్మాయిగా మరీ మాస్ పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తున్న తీరు.. ముందు రక్తం కారుతున్న కత్తులు పరిచి కనిపిస్తుంటే పక్కనే నిక్కరు ధరించి సెల్వరాఘవన్ కనిపిస్తున్నతీసు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.