Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ ని శాసిస్తున్న కౌశల్

బిగ్ బాస్ ని శాసిస్తున్న కౌశల్

kaushal rules bigg boss 2సినిమాల్లో చిన్నా చితక వేషాలు వేసుకునే కౌశల్ ఇప్పుడు బిగ్ బాస్ 2 ని శాసిస్తున్నాడు . బిగ్ బాస్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు కౌశల్ . హిందీలో ఇప్పటివరకు 11 సిరీస్ లు కంప్లీట్ అయ్యాయి అలాగే ఇతర బాషలలో కూడా సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ షో రన్ అవుతోంది కానీ ఎక్కడ కూడా ఇంతటి ఇమేజ్ ని సొంతం చేసుకున్న వాళ్ళు లేరు అలాగే ఓ కంటెస్టెంట్ కు ఆర్మీ అని ఓ అభిమాన సంఘం ఏర్పడింది లేదు అది ఒక్క కౌశల్ విషయంలోనే జరిగింది . కౌశల్ ఆర్మీ స్టార్ హీరోల అభిమాన సంఘంలా తయారయ్యింది దాంతో కౌశల్ ఏకంగా బిగ్ బాస్ నే శాసించే స్థాయికి చేరుకున్నాడు .

మోడల్ గా పరిచయమైన కౌశల్ ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ బుల్లితెరపై కూడా రాణించాడు . అయితే కౌశల్ కు వెండితెర పై కానీ బుల్లితెరపై కానీ పెద్దగా స్టార్ డం రాలేదు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ 2 హౌజ్ లోకి అడుగుపెట్టాడో అప్పటినుండి మెల్లిమెల్లిగా బిగ్ బాస్ హౌజ్ ని శాసించే స్థాయికి చేరుకున్నాడు . కౌశల్ కు బయట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది దాంతో ఆ ఆర్మీ పై అనుమానాలు వ్యక్తం కూడా అవుతున్నాయి . అయితే ఈ స్థాయిలో కౌశల్ ఆర్మీ ఏర్పడటం మాత్రం బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి . ఇక బిగ్ బాస్ 2 మరో రెండు వారాల్లో ముగియనుంది కాగా బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ అంటూ అప్పుడే ప్రచారం చేస్తున్నారు కౌశల్ ఆర్మీ . మరి బిగ్ బాస్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి .

- Advertisement -

English Title: kaushal rules bigg boss 2

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All