Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ ని మరోసారి ఘోరంగా అవమానించిన కత్తి

పవన్ కళ్యాణ్ ని మరోసారి ఘోరంగా అవమానించిన కత్తి

Kathi mahesh again insulted pawan kalyanపవన్ కళ్యాణ్ ని ఇప్పటికే పలుమార్లు కత్తి మహేష్ అవమానించగా తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఘోరాతి ఘోరంగా అవమానించాడు వివాదాస్పద వ్యక్తి కత్తి మహేష్ . గతకొంత కాలంగా వివాదాలకు దూరంగా ఉంటూ సైలెంట్ అయిన కత్తి మహేష్ మరోసారి నిన్న కత్తుల లాంటి మాటలతో మెగా అభిమానుల గుండెలను చీల్చాడు , పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించాడు . జనసేన స్థాపించి రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 3 నుండి 7 స్థానాలు వస్తే అదే గొప్ప అంతకుమించి సీట్లు గెలుచుకునే దమ్ము పవన్ కళ్యాణ్ కు లేదు , జనసేన కు లేదు అంటూ విమర్శలు చేసాడు .

ఇంతకుముందు కూడా మెగాస్టార్ చిరంజీవి ని అలాగే పవన్ కళ్యాణ్ ని అదేపనిగా విమర్శించిన కత్తి మహేష్ మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యాడు . ఒకదశలో మెగా ఫ్యాన్స్ అతడిపై దాడి కూడా చేయడానికి సిద్ధపడ్డారు . అయితే వివాదాన్ని పరిష్కరించుకుందామని రెండు వైపులా అనుకోవడంతో రాజీ కొచ్చి అప్పటి నుండి పవన్ ని విమర్శించడం మానేసాడు . కానీ అనూహ్యంగా నిన్న మరోసారి పవన్ కళ్యాణ్ ని , జనసేన ని విమర్శించి మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు మహేష్ . ఇక ఈ వివాదం ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి . ఎందుకంటే కత్తి మహేష్ పై మెగా ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు .

- Advertisement -

English Title: Kathi mahesh again insulted pawan kalyan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All