Homeటాప్ స్టోరీస్జగన్ మగతనం పై సవాల్ విసిరిన పవన్ కళ్యాణ్

జగన్ మగతనం పై సవాల్ విసిరిన పవన్ కళ్యాణ్

Pawan kalyan sensational comments on jaganజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు . ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అసెంబ్లీ కి వెళ్లకుండా బయట పాదయాత్రలు చేసుకుంటున్నాడని , అసెంబ్లీ కి వెళ్లి ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని ప్రశ్నిస్తే అప్పుడు నీ మగతనం ఏంటో తెలుస్తుంది అంతేకాని ఇలా పాదయాత్రలు చేస్తే కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు . ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన నువ్వు ప్రశ్నించడం లేదు నేను ఆ పని చేస్తుంటే నాపై విమర్శలు చేస్తావా ? అంటూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ . మీరే కాదు జగన్ మీ పార్టీ ఎం ఎల్ ఏ లు కూడా ప్రజా సమస్యలపై పోరాడటం లేదు , భూ కబ్జా లు చేసుకుంటూ పోతున్నారు కానీ ప్రజా సమస్యలపై గళం ఎత్తుతొంది మేమె అంటూ జగన్ పార్టీ ఎం ఎల్ ఏ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు పవన్ .

జగన్ పైన అలాగే జగన్ పార్టీ ఎం ఎల్ ఏ లపైన పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది . జగన్ ని పట్టుకొని నీ మగతనం ఏంటి ? అని ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది . 2019 మేలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ కి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది . దాంతో పోటీపడి విమర్శలు చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు కాగా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాన్ని బాగానే వంట బట్టించుకున్నాడు .

- Advertisement -

English Title: Pawan kalyan sensational comments on jagan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All