Homeటాప్ స్టోరీస్బుల్లితెర‌పై బాగానే కిక్కెక్కించిందే!

బుల్లితెర‌పై బాగానే కిక్కెక్కించిందే!

బుల్లితెర‌పై బాగానే కిక్కెక్కించిందే!
బుల్లితెర‌పై బాగానే కిక్కెక్కించిందే!

వెండితెర‌పై ఆక‌ట్టుకోలేని చిత్రాలు బుల్లితెర‌పై ఈ మ‌ధ్య ప్ర‌భావాన్నిచూపిస్తున్నాయి. `ఆర్ ఎక్స్ 100` సినిమాతో సంచ‌ల‌నం సృష్టించాడు యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమాతో స‌రికొత్త ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయ‌న ఆ త‌రువాత దాన్ని కొన‌సాగించ‌లేక‌పోతున్నాడు. `ఆర్ ఎక్స్ 100` తెచ్చిన క్రేజ్‌తో వ‌రుస‌గా భారీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకున్నా అనుకున్న స్థాయిలో మాత్రం విజ‌యాల్ని ద‌క్కించుకోలేక‌పోయారు.

హిప్పీ, గుణ 369, నానితో క‌లిసి న‌టించి గ్యాంగ్‌లీడ‌ర్ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయాయి. విభిన్న‌మైన క‌థా, క‌థ‌నాల‌తో రూపొందిన చిత్రం `90 ML`‌. కార్తికేయ న‌టించిన ఈ చిత్రం వెండితెర‌పై ఆశించిన స్థాయి విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. బుల్లితెర‌పై మాత్రం అనూహ్యంగా ప్ర‌భావాన్ని చూపించింది. వెండితెర‌పై హిట్ కాని ఈ చిత్రం బుల్లితెర‌పై సూప‌ర్‌హిట్ అయ్యింది.

- Advertisement -

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో అంతా ఇంటిప‌ట్టునే వుంటున్నారు. వినోదానికి టీవీనే ప్ర‌ధాన వ‌స్తువుగా మారింది. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్‌లో `90 ML`టెలికాస్ట్ అయింది. దీనికి టీఆర్పీ రేటింగ్స్ భారీ స్థాయిలో రావ‌డం విశేషం. దీంతో `90 ML` బుల్లితెర‌పై బాగానే కిక్కెక్కించిందే అని సినీ జ‌నం అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All