Homeటాప్ స్టోరీస్90ml మూవీ రివ్యూ

90ml మూవీ రివ్యూ

90ml మూవీ రివ్యూ
90ml మూవీ రివ్యూ

నటీనటులు: కార్తికేయ, నేహా సోలంకి, రావు రమేష్, ప్రగతి, రవి కిషన్ తదితరులు
నిర్మాత: అశోక్ రెడ్డి
దర్శకత్వం: శేఖర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
ఎడిటర్‌: ఎస్.ఆర్ శేఖర్
ఆర్ట్: జీ.ఎం శేఖర్
విడుదల తేదీ: డిసెంబర్ 6, 2019
రేటింగ్: 2.5/5

ఆరెక్స్ 100 తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ ఆ తర్వాత ఎందుకో దాన్ని ఉపయోగించుకుని మంచి సినిమాలు చేయలేకపోయాడు. ఈ ఏడాది కార్తికేయ చేసిన మూడు సినిమాలు కూడా ప్లాపయ్యాయి. హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్ సినిమాలు మంచి ఫలితాల్ని ఇవ్వలేదు. దీంతో కార్తికేయ 90ml అనే ఆసక్తికర కాన్సెప్ట్ తో సినిమా చేసాడు. టీజర్, ట్రైలర్ వరకూ చూసుకుంటే ఈ సినిమా బాగుందనే అనిపించింది. మరి సినిమా చూసాక కూడా అదే ఫీల్ కలుగుతుందా?

- Advertisement -

కథ:
టీజర్, ట్రైలర్ లో చెప్పినట్లే ఈ కథ చాలా సింపుల్. రోజూ కచ్చితంగా ఒక క్వాంటిటీలో ఆల్కహాల్ తీసుకోకపోతే దేవదాస్ (కార్తికేయ) చచ్చిపోతాడు. చిన్నప్పుడే తనకొచ్చిన ఒక డిజార్డర్ వల్ల రోజూ మూడు పూటలా ఆల్కహాల్ తాగాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే పెరిగి పెద్దయ్యాక తన గురించి తెలిసి ఎవరూ ఉద్యోగం ఇవ్వకపోవడంతో చివరికి వైన్ షాప్ లో మేనేజర్ గా జాయిన్ అవుతాడు. అలా లైఫ్ సాఫీగా సాగిపోతున్న టైమ్ లో సువాసన (నేహా సోలంకి) తన లైఫ్ లోకి వస్తుంది. తనకున్న జబ్బుని దాచిపెట్టి మరీ ప్రేమిస్తాడు. కొన్ని సీన్ల తర్వాత ఆమె కూడా తిరిగి ప్రేమిస్తుంది. అయితే సువాసన ఫ్యామిలీ మొత్తం ఆల్కహాల్ కి వ్యతిరేకం. అసలు ఆ మనుషులు అంటేనే వాళ్ళకి కంపరం.

మరి దేవదాసు గురించి నిజం తెలుసుకున్న వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? దేవదాసు లైఫ్ లోకి జాన్ విక్ (రవి కిషన్) దూరి ఎలాంటి అరాచకాల్ని సృష్టించాడు. దాని వల్ల ఎటువంటి పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:
కథల ఎంపికలో కార్తికేయ విఫలమవుతున్నా, నటుడిగా సినిమా సినిమాకూ మెరుగవుతున్నాడు కార్తికేయ. 90ml లో మరింత కాన్ఫిడెంట్ గా కనిపించాడు. కామెడీ సీన్స్ లో చాలా సౌకర్యంగా కనిపించాడు. డ్యాన్సులు కూడా ఇరగదీసాడు. ఇక నేహా సోలంకి కూడా పర్వాలేదు. ముఖ్యమైన సన్నివేశాల్లో కొంత తేలిపోయినా మొత్తంగా బానే మ్యానేజ్ చేసింది. రావు రమేష్ తనకలవాటైన తీరులో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రవి కిషన్ పాత్రను కొంత పూరి జగన్నాథ్ విలన్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీర్చిదిద్దినట్లు అనిపిస్తుంది. కొంచెం కామెడీ టచ్ ఉంటూ మొదట సరదాగా అనిపించినా తర్వాత బోర్ కొడుతోంది. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:
కథ మొత్తంగా కాకుండా, బేసిక్ ప్లాట్ లైన్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యే పాయింట్ తో ఉండడం వల్ల ప్రేక్షకులు ఈజీగా కథలో లీనమయ్యారు. అయితే అసలు కథ చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది. కాన్ఫ్లిక్ట్ పాయింట్ బలంగా లేదు. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా ఉంది. కొత్త పాయింట్ ను తీసుకున్నారు కానీ దాన్ని సరికొత్తగా చెప్పడంలో విఫలమయ్యారు. శేఖర్ రెడ్డి దర్శకత్వం కూడా పాత చింతకాయ పచ్చడి టైపులో ఓల్డ్ ఫార్మాట్ లో కొనసాగింది. ఒక కామెడీ సీన్, ఒక లవ్ సీన్, ఒక ఫైట్, ఒక పాట అంటూ ముందే రాసుకుని దాని ప్రకారం సన్నివేశాలను పేర్చుకుంటూ వెళ్లిపోయారనిపిస్తుంది.

సినిమాటోగ్రఫీ చాలా సాధారణంగా ఉంది. అంత ప్రత్యేకంగా చెప్పుకునేలా ఏం లేదు. అనూప్ రూబెన్స్ అవుట్ డేట్ అయిపోయాడు. ఒక్క వినిపించుకోరు పాట తప్పితే మిగిలినవేవీ ఆకట్టుకోవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ చాలా బ్యాడ్. ఈజీగా 15 నిమిషాలకు పైగా సన్నివేశాలకు కోత పడవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారనిపిస్తుంది.

విశ్లేషణ:
పాయింట్ ఆసక్తికరంగా తీసుకున్నా దాన్ని డీల్ చేసిన విధానంలోనే తేడా కొట్టేస్తుంది. సినిమా మొదటి అరగంట బాగుంటుంది. ఒక మంచి, విభిన్న సినిమాకు వచ్చామన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెటప్ అంతా కుదిరాక, రొటీన్ సన్నివేశాలు పడతాయి. ఇంటర్వెల్ ముందు కానీ ప్రేక్షకుల్లో మళ్ళీ ఆసక్తి కలగదు. ఓ మోస్తరు బ్యాంగ్ తో ఇంటర్వెల్ పడ్డాక, సెకండ్ హాఫ్ ను మంచిగా డీల్ చేసి ఉంటారన్న భావన కలుగుతుంది. అయితే అక్కడ కూడా అదే తంతు. మొదలు బానే ఉన్నా నెమ్మదిగా తుస్సుమనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రొటీన్ వ్యవహారంతో మంచి అవకాశాన్ని వృధా చేసుకున్నారన్న భావన కలుగుతుంది. ఇలాంటి ట్రీట్మెంట్ లతో కార్తికేయ హిట్ ట్రాక్ ఎక్కాలనుకోవడం సాహసమే.

చివరిగా: 90ML – కిక్కు లేదు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All