Homeటాప్ స్టోరీస్మహేష్ సినిమా క్యాప్షన్ నిఖిల్ కు

మహేష్ సినిమా క్యాప్షన్ నిఖిల్ కు

మహేష్ సినిమా క్యాప్షన్ నిఖిల్ కు
మహేష్ సినిమా క్యాప్షన్ నిఖిల్ కు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన ఖలేజా చిత్రం తనకు పెద్ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఖలేజా చిత్ర కాన్సెప్ట్ దైవం మనుష్య రూపేణా క్యాప్షన్ గా కూడా పెట్టారు. ఇప్పుడు ఈ క్యాప్షన్ ను నిఖిల్ టైటిల్ గా వాడుకుంటున్నాడు. నిఖిల్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ 18 పేజెస్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీంతో తన నెక్స్ట్ సినిమా కార్తికేయ సీక్వెల్ పై పూర్తిగా దృష్టి పెడుతున్నాడు.

నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇప్పటికే కార్తికేయ సీక్వెల్ ను ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. ఆగస్ట్ నుండి ఈ చిత్ర షూటింగ్ తిరిగి మొదలవుతుంది. వియత్నాం, యూరోప్ లలో షూటింగ్ జరుపుకుంటుంది.

- Advertisement -

ఇక ఈ చిత్రానికి కార్తికేయ 2 వర్కింగ్ టైటిల్ గా ఉన్నా ఇప్పుడు దైవం మనుష్య రూపేణా సినిమా టైటిల్ గా ఫిక్స్ చేశారట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All