Homeటాప్ స్టోరీస్ఆసక్తికరంగా నిఖిల్ 18 పేజెస్ ఫస్ట్ లుక్

ఆసక్తికరంగా నిఖిల్ 18 పేజెస్ ఫస్ట్ లుక్

ఆసక్తికరంగా నిఖిల్ 18 పేజెస్ ఫస్ట్ లుక్
ఆసక్తికరంగా నిఖిల్ 18 పేజెస్ ఫస్ట్ లుక్

యంగ్ హీరో నిఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం 18 పేజెస్. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈరోజు నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉండటం విశేషం. నిఖిల్ కళ్ళకు గంతలు కట్టి, ఆ గంతలపై అనుపమ ఏదో మెసేజ్ రాస్తుంటుంది. ఇద్దరూ మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్లు ఈ ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమవుతోంది. అత్యంత ఆసక్తికర కాన్సెప్ట్ తో 18 పేజెస్ చిత్రం తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సుకుమార్ సమర్పిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 సంస్థ నిర్మిస్తోంది. పల్నాటి సూర్య ప్రతాప్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన కుమారి 21 ఎఫ్ ఎంత మంచి సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. మరోసారి అలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేయాలనుకుంటున్నారు.

- Advertisement -

గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 18 పేజెస్ గురించి మరింత సమాచారం త్వరలో బయటకు వచ్చే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All