Homeటాప్ స్టోరీస్బ‌స్తీ బాల‌రాజ్ వ‌చ్చేశాడు!

బ‌స్తీ బాల‌రాజ్ వ‌చ్చేశాడు!

బ‌స్తీ బాల‌రాజ్ వ‌చ్చేశాడు!
బ‌స్తీ బాల‌రాజ్ వ‌చ్చేశాడు!

`ఆర్ ఎక్స్ 100` సినిమాతో చిన్న‌ చిత్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన హీరో కార్తికేయ గుమ్మ‌కొండ‌. హీరోగా మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్నా ఆ త‌రువాత చేసిన వ‌రుస చిత్రాలు గుణ 369, 90 ఎం.ఎల్ ఆశించిన విజ‌యాల్ని అందించ‌లేక‌పోయాయి. దీంతో కొంత ఆలోచ‌న‌లోప‌డ్డ కార్తికేయ ఈ ద‌ఫా మెగా కాంపౌండ్‌లో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. గుణ 369 చిత్ర ట్రైల‌ర్ లాంచ్‌లో స‌ర‌దాగా గీతా ఆర్ట్స్‌లో సినిమా చేసే అవ‌కాశం ఇవ్వండి సార్ అని కార్తికేయ అడిగిన మాట‌ని నిజం చేస్తూ అల్లు అర‌వింద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు నిర్మాత‌గా నిర్మిస్తున్న చిత్రం `చావు క‌బురు చ‌ల్ల‌గా`. ఈ చిత్రం ద్వారా కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈచిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం హైద‌రాబాద్‌లో మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని హీరో కార్తికేయ గుమ్మ‌కొండ ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు.

- Advertisement -

ఈ చిత్రంలో కార్తికేయ బ‌స్తీబాల రాజు పాత్ర‌లో ఊర‌మాస్ గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నారు. కార్తికేయ రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో కార్తికేయ గ‌ల్ల లుంగి పైకెత్తిక‌ట్టి గ‌ళ్ల చొక్కా వేసుకుని స్వ‌ర్గ‌పురి వాహ‌నంపై బీడీ వెలిగించి ద‌మ్ము లాగుతున్న స్టిల్ సినిమా ఎంత మాసీవ్ గా వుండ‌మోతోందో అర్థ‌మ‌వుతోంది. స్వ‌ర్గ‌పురి వాహ‌నం న‌డిపై డ్రైవ‌ర్‌గా కార్తికేయ న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో సూప‌ర్‌హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుని మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేలా కార్తికేయ క‌నిపిస్తున్నాడు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All