
సినిమా ఇండస్ట్రీలో మహళిల హరాష్‌మెంట్ ఎక్కువే అన్నది ఇటీవలీ కాలంలో క్రమక్రమంగా బయటపడుతోంది. ఎంత బ్యాగ్రౌండ్ వున్నా వేధింపులు తప్పడం లేదని ఇటీవల శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీనియర్ హీరో కూతురిని అయినా తననీ వేధించారని, ఆ కారణంగానే తాను నటిగా చాలా సినిమాల్ని కోల్పోవాల్సి వచ్చిందని వరలక్ష్మి ఇటీవల ఓ మీడియాతో సంభాషిస్తూ సంచలన విషయాల్ని బయటపెట్టింది.
ఆమె తరహాలోనే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్‌ని కూడా కొంత మంది బీటౌన్‌లో ఏడిపించారని తెలిసింది. ఇది బాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కనీకాథిల్లాన్ కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెల మూడి వైఫ్. ఇటీవల ఇద్దరి మధ్య అభిప్రాయ భేధాలు తలెత్తడంతో విడిపోయారు. కనికా థిల్లాన్ బాలీవుడ్‌లో రైటర్‌గా కొనసాగుతోంది.
మన్‌మర్జియా, జడ్జిమెంటల్ హై క్యా, కేదార్‌నాథ్ వంటి చిత్రాలకు కథలు అందించింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ కోసం `గల్తీ` పేరుతో ఓ వెబ్ సిరీస్‌కి కథ అందించింది. కియారా అద్వానీ కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఇటీవలే ఆన్‌లైన్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది. మహిళలకు ఇక్కడ ప్రాధాన్యత తేదని, వారికి క్రెడిట్ ఇచ్చే విషయంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని కనిక థిల్లాన్ వెల్లడించింది. శారీరకంగానే కాకుండా ఇక్కడ మహిళలని మానసికంగా కూడా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది.