Homeటాప్ స్టోరీస్“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమా కొత్త ట్రైలర్ విశేషాలు

“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమా కొత్త ట్రైలర్ విశేషాలు

“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమా కొత్త ట్రైలర్ విశేషాలు
“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమా కొత్త ట్రైలర్ విశేషాలు

అదేదో సినిమాలో ఒక బ్యూటిఫుల్ ఫెలో గురించి ఇంకొక బ్యూటిఫుల్ పర్సన్ చెబుతూ , “అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చం అలాగే ఉంటాడు” అని చెబుతారు.” సరే ఆ సంగతి కాసేపు పక్కనబెడితే “ధైర్యం” అనే ఒక పదార్ధానికి డ్రెస్ వేసి చేతిలో వోడ్కా గ్లాస్ ఇస్తే ఎలా ఉంటుందో రాంగోపాల్ వర్మ అచ్చం అలాగే ఉంటాడు. ఇండస్ట్రీలో బయోపిక్ అనే ఒక ట్రెండ్ మొదలు పెట్టింది ఆయనే. ఎదుటి వాళ్లు మాట్లాడుకోవడానికి భయమేసే ఒక టాపిక్ గురించి ఏకంగా సినిమా తీసి జనాల్లోకి వదిలి దానిని డబ్బులు చేసుకోవడం ఆయనకు వోడ్కా తో పెట్టిన విద్య. అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు మహారాష్ట్ర కింగ్ బాల్ ఠాక్రే జీవిత చరిత్రను “సర్కార్” అనే పేరుతో తీసి సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత రాయలసీమ ఫ్యాక్షన్ కథని రక్త చరిత్ర గా తెరకెక్కించాడు. ఆ తర్వాత బెజవాడ రాజకీయాలను, రౌడీయిజాన్ని వంగవీటి సినిమాలో చూపించాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఒక పార్టీని బహిరంగంగా విమర్శిస్తూ మరొక పార్టీకి అంతర్గతంగా సపోర్ట్ చేసే “లక్ష్మీస్ ఎన్టీఆర్” ని సినిమా కూడా తీశాడు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తనకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చేసరికి రాంగోపాల్ వర్మ కి అస్సలు గుండె మీద గుడ్డ ఆగట్లేదు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమాలో అయితే ఏకంగా ఎవరిని ఉద్దేశించి అయితే సినిమా తీస్తున్నారో, వాళ్ల నిజజీవిత పాత్రలు, ఫోటోలు, పేర్లు, మాటతీరు నడక హావభావాలు, నిజజీవిత సంఘటనలు తో సహా దించేసి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఈ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా కి రూపాయి కూడా ఖర్చు కాకుండా అధికార పార్టీకి సంబంధించిన రాజకీయ పార్టీ వాళ్లు ఈ సినిమాని పబ్లిసిటీ చేస్తున్నారు. కరెక్ట్ గా దీపావళి రోజు సినిమా ట్రైలర్ విడుదల చేసి, అసలే బాధలో ఉన్న గత ప్రభుత్వం పార్టీ వాళ్లకి ఇంకా కాలేలా చేసిన రాంగోపాల్ వర్మ, ప్రస్తుతం సదరు ప్రతిపక్షం వాళ్లు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై చేస్తున్న, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అతనికి బెయిల్ రద్దు అవుతుంది.! అని ప్రచారం చేస్తున్న పరిణామాల మధ్య ఇంకొక ట్రైలర్ ని విడుదల చేశాడు.

- Advertisement -

అందులో అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సన్నివేశాలు మక్కీకి మక్కీ చూపించాడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత్రధారి ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి “ఏంటి..! అలా కళ్లు పెద్దవి చేస్తున్నావ్.. దించు..” అన్న డైలాగ్ అయితే కెమెరా ఫ్రేమ్ తో సహా దిగిపోయింది. ఈ సినిమాని నవంబర్ 29న విడుదల చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ వంగవీటి సినిమా మ్యూజిక్ అందించిన రవిశంకర్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. రాంగోపాల్ వర్మ గత చిత్రం భైరవగీత కి డైరెక్టర్ గా పరిచయం అయిన ఎడిటర్ సిద్ధార్థ తాతోలు ని ఈ సినిమాకి కూడా డైరెక్టర్ గా పేరు వేస్తున్నాడు వర్మ. పూర్తిస్థాయి భారీ మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ బలంతో ఈ సినిమా ఇంకా ఎంత మందికి నిద్రలేని రాత్రులు కలిగిస్తుందో.? ఎంతమందిని మానసికంగా హింసిస్తుందో చూద్దాం.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All