Homeన్యూస్కమల్ హాసన్ కు కరోనా..?

కమల్ హాసన్ కు కరోనా..?

Kamal Hassan Admited in Hospital with Infection

యూనివర్సల్ స్టార్, లోక నాయకుడు కమల్ హాసన్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో చెప్పారు. తనకు కరోనా వచ్చిందని చెప్పకుండా ఆ మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని.. దానితో జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ మెసేజ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే కమల్ హాసన్ తాను హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా అని ట్వీట్ చేశారు. యూఎస్ నుండి తిరిగి వచ్చాక కాస్త దగ్గు వచ్చిందని.. టెస్టులు చేయిస్తే ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్వహించారని అన్నారు. అందుకే హాస్పిటల్ లో ఐసోలేషన్ లో ఉన్నట్టు కమల్ హాసన్ ప్రకటించారు.

- Advertisement -

కమల్ హాసన్ ఇలా ట్వీట్ చేయడమే ఆలస్యం ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులంతా రీ ట్వీట్స్ చేస్తున్నారు. తమిళ బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న కమల్ హాసన్ ఆయన సిక్ అయిన కారణంగా ఎవరు బిగ్ బాస్ హోస్ట్ చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All