
పెళ్లి తరువాత కూడా వరుస ఆఫర్లతో బిజీగా వున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్. ఇటీవలే తన చిరకాల మిత్రుడు, బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్న కాజల్ మాల్దీవ్స్‌లో హనీమూన్ పేరుతో నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ నైట్‌కి సంబంధించిన మల్లెపూలని కూడా ఇన్ స్టాలో పెట్టి హాట్ టాపిక్‌గా మారిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్‌తో `ఆచార్య`, మంచు విష్ణుతో కలిసి `మోసగాళ్లు` చిత్రంలో నటిస్తోంది.
ఈ రెండు చిత్రాల్లో `మోసగాళ్లు` రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇదిలా వుంటే కాజల్ నటించిన తొలి వెబ్ థ్రిల్లర్ `లైవ్ టెలీకాస్ట్`. జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌పై కాజల్ భారీ ఆశలే పెట్టుకుందట. కారణం తను నటించిన తొలి హారర్ థ్రిల్లర్ కావడంతో పాటు తొలి వెబ్ డ్రామా కావడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆరు చిత్రాల్లో నటిస్తున్న కాజల్ `లైవ్ టెలీకాస్ట్` వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి తాజాగా వెల్లడించింది.
ఏకాంత ప్రదేశంలో చిత్రీకరణ చేయడం వల్ల తాను నిద్రకూడా పోలేదని, ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలో తాను నిద్రలేని రాత్రులు గడిపానని వెల్లడించింది. తాము షూటింగ్ చేసిన ఇల్లు కొండపై వుండేదని, దాని చుట్టుపక్కల పరిసరాల్లో ఒక్క ఇల్లు కూడా లేదని తెలిపింది. చుట్టూ వాతావరణం నిర్మానుష్యంగా భయంకరంగా వుండేదని కాజల్ తెలిపింది. ప్యాకప్ చెప్పాక ఇంటికి వెళ్లినా తనకు నిద్ర సట్టలేదని వాపోయింది.