
అందాల చందమమా కాజల్ అగర్వాల్ ఇటీవల గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి బందం తొమ్మిదేళ్ల క్రితమే మొదలైందని ఇటీవల అబిమానులతో నిర్వహించిన స్పెల్ చిట్ చాట్లో వెల్లడించింది కాజల్ అగర్వాల్. చాలా కాలంగా తెలిసిన వ్యక్తి కావడంతో అతనితో ప్రేమలో పడిందట. ఆ ప్రేమ కాల క్రమంలో పెళ్లి పీటలెక్కిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
నవంబర్‌లో ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. ముంబైలోని హోటల్ తాజ్ మహల్‌లో ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. గౌతమ్ కిచ్లూ ఇంటీరియర్ బిజినెస్‌మెన్. ఇటీవలే గృహోపకరణాల బ్రాంగ్ `కిచెడ్`ని ప్రారంభించాడు. దీని కోసం కాజల్ అగర్వాల్ ప్రచార కర్త అవతారం ఎత్తేసింది.
ఇదిలా వుంటే ఇటీవల అబిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నోత్తరాల సెషన్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన చిలిపి ప్రశ్నలకు టక టకా సమాధానం చెప్పింది. ఈ సందర్భంగా . ఇంతకు ముందెన్నడూ చూడని ఫొటోలని పోస్ట్ చేసి షాకిచ్చింది. వాటిలో కాజల్ భర్త గౌతమ్‌కు లిప్ టు లిప్ కిస్ ఇస్తున్న ఫొటో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో ఇన్ స్టాలో వైరల్‌గా మారింది.