Homeగాసిప్స్కాజ‌ల్ టైమ్ చూసి కొడుతోందిగా!

కాజ‌ల్ టైమ్ చూసి కొడుతోందిగా!

కాజ‌ల్ టైమ్ చూసి కొడుతోందిగా!
కాజ‌ల్ టైమ్ చూసి కొడుతోందిగా!

సినీ ఇండ‌స్ట్రీలో ఏ స‌మీక‌ర‌ణాలు ఎలా మార‌తాయో చెప్పం క‌ష్టం. రాత్రికి రాత్రే స్టార్స్ కావ‌చ్చు.. లేదా వున్న‌దంతా ఊడ్చేయోచ్చు కూడా. అందుకే ఇక్క‌డ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడే త‌మ ప్ర‌తాపం చూపించాల‌ని చాలా మంది ప్రిపేర్డ్‌గా వుంటుంటారు. డ‌బ్బు, స‌క్సెస్‌ త‌ప్ప మ‌రోదానికి ఇక్క‌డ విలువ లేక‌పోవ‌డంతో మ‌నుషుల ప్ర‌వ‌ర్త‌న కూడా అలాగే వుంటోంది. ఇదే సూత్రాన్ని కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫాలో అవుతోంది. త‌న చేతిలో సినిమాలు పెద్ద‌గా లేక‌పోయినా భారీగా డిమాండ్ చేస్తోంద‌ని తెలిసింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ముందు త్రిష‌ని క‌న్ఫ‌మ్ చేసుకున్నారు. అయితే ఆమె పాత్ర ప్రాధాన్య‌త విషయంలో అభిప్రాయ బేధాలు త‌లెత్త‌డంతో త్రిష ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించింది. దీంతో చిత్ర బృందం మ‌రో హీరోయిన్ కోసం సెర్చింగ్ మొద‌లు పెట్టింది.

- Advertisement -

`ఖైదీ నంబ‌ర్ 150`లో న‌టించిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని చిత్ర బృందం సంప్ర‌దించింద‌ట‌. అయితే రెగ్య‌ల‌ర్ కెమ్యున‌రేష‌న్‌కి మించి కాజ‌ల్ డిమాండ్ చేస్తోంద‌ట‌. వ‌రుస ఫ్లాపుల్లో వున్నా ఇప్పుడు కాజ‌ల్ చేతితో భార‌తీయుడు 2, మంచు విష్ణు `మోస‌గాళ్లు` వంటి భారీ చిత్రాలున్నాయి. దీంతో ఆమె డిమాండ్‌ని చిరు టీమ్ అంగీక‌రించ‌డం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All