
కాజల్ అగర్వాల్ తన ప్రేమ, పెళ్లి వార్తలపై స్పందించని విషయం తెలిసిందే. తన ప్రేమ, డేటింగ్ లపై వస్తున్న వార్తలపై తాజాగా కాజల్ స్పందించింది. యస్ తాను ప్రేమలో వున్నానని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. తను గత కొంత కాలంగా ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూని ప్రేమిస్తున్నానని, అతన్నే వివాహం చేసుకోబోతున్నానని వెల్లడించింది.
కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూల వివాహం ఈ నెల 30న ముంబైలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహంలో ఇరు కుటుంబాల కు సంబంధించిన అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారు. ఇటీవలే ఎంగేజ్‌మెంట్ జరిగిందని కాజల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన కాజల్ తాజాగా మరో ఫొటోని షేర్ చేసింది.
విజయదశమి సందర్భంగా అభిమానులతో ఓ ఫొటోని పంచుకుంది కాజల్ అగర్వాల్. ఈ ఫొటోలో కాజల్‌కు కాబోయే వరుడు గౌతమ్ కిచ్లూతో కలిసి చనువుగా వున్న ఈ ఫొటో నెట్టింట్లో సందడి చేస్తోంది. అన్నట్టు గౌతమ్ కిచ్లూ ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించిన బిజినెస్‌ని రన్ చేస్తున్న విషయం తెలిసిందే.