Homeటాప్ స్టోరీస్కాజ‌ల్ పెళ్లాడ‌బోయేది ఇత‌న్నేనా?

కాజ‌ల్ పెళ్లాడ‌బోయేది ఇత‌న్నేనా?

కాజ‌ల్ పెళ్లాడ‌బోయేది ఇత‌న్నేనా?
కాజ‌ల్ పెళ్లాడ‌బోయేది ఇత‌న్నేనా?

పుష్క‌ర కాలం దాటినా ఇప్ప‌టికీ అదే క్రేజ్‌ని మెయింటైన్ చేస్తూ వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంటోంది అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్. వ‌య‌సు మీద ప‌డుతున్నా వ‌న్నె త‌ర‌గ‌ని అందాల‌తో కుర్ర‌కారుకి క‌ల‌ల రాణిగా నిలుస్తోంది. ఇటీవ‌ల అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు సై అంటూ హాట్ హాట్ ఫొటోల‌కు పోజులిచ్చి హీటెక్కించిన చందమామ ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ య‌మ బిజీగా వుంది.

అయితే కాజ‌ల్ పెళ్లికి రెడీ అవుతోంద‌ని ఇటీవ‌ల వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. కాజ‌ల్ పెళ్లికి రెడీ అవుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఇటీవ‌ల ఓ యువ వ్యాపార వేత్త‌తో కాజ‌ల్ ఎంగేజ్‌మెంట్ సీక్రెట్‌గా జ‌రిగింద‌ని వార్త‌లు షికారు చేశాయి. అయితే ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని తెలిసింది. తాజాగా కాజ‌ల్ పెళ్లిపై మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేయ‌డం మొద‌లైంది.

- Advertisement -

కాజ‌ల్ తాజాగా ఓ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ తో ప్రేమ‌లో వుంద‌ని త్వ‌ర‌లో ఈ ఇద్ద‌రు వివాహం చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. యంగ్ బిజినెస్‌మెన్ గౌత‌మ్ కిచ్లూతో కాజ‌ల్ గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వుంద‌ట‌. ఇంటీరియ‌ర్ అండ్ ఫ‌ర్నీచ‌ర్ కంప‌నీని ర‌న్ చేస్తున్న గౌత‌మ్ కి‌చ్లూని కాజ‌ల్ పెళ్లి పెళ్లి చేసుకోబోతోంద‌ట‌. ఇప్పుడిదే వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అయితే ఇటీవ‌ల వ‌చ్చిన త‌న పెళ్లి వార్త‌ల‌పై కాజ‌ల్ మాత్రం ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. తాజా వార్తల‌పై అయినా కాజ‌ల్ స్పందిస్తుందేమో చూడాలి అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All