
క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సీక్రెట్‌గా పెళ్లికి రెడీ అయిపోతోందంటూ వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అత్యంత సన్నిహితులు పాల్గొనగా కాజల్ అగర్వాల్ ఎంగేజ్‌మెంట్ జరిగిందని వార్తలు షికారు చేశాయి. ముంబైకి చెందిన యంగ్ బిజినెస్‌మెన్ గౌతమ్‌తో కాజల్ నిశ్చితార్థం పూర్తయిందని, త్వరలో కాజల్ తల్లిదండ్రులు పెళ్లికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి.
అత్యంత రహస్యంగా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రమే ప్రత్యేకంగా హాజరయ్యాడని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై కాజల్ అగర్వాల్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా వుంటే తాజాగా కాజల్ అగర్వాల్‌పై మరో వార్త హల్‌చల్ చేస్తోంది. కాజల్ అగర్వాల్ త్వరలో వివాహం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చిందని, అందుకే తను అంగీకరించిన చిత్రాల్లో ముందు భారీ చిత్రాల షూటింగ్‌లని పూర్తి చేయాలని భావిస్తోందట.
అందులో భాగంగా క్రేజీ డైరెక్టర్ కొరటాల శివకు కాజల్ ఫోన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కొరటాల రూపొందిస్తున్న `ఆచార్య` చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో తనకు సంబంధించిన పోర్షన్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేయమని కాజల్ దర్శకుడు కొరటాలని కోరినట్టు చెబుతున్నారు. కొరటాల కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. కాజల్ `ఆచార్య`తో పాటు శంకఱ్ `ఇండియన్ 2`, మంచు విష్ణు `మోసగాళ్లు` తదితర చిత్రాల్లో నటిస్తోంది.