
వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లికి రెడీ అవుతోందంటూ గత కొంత కాలంగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఓ బిజినెస్‌మెన్‌తో కాజల్‌కు ఇటీవల లాక్‌డౌన్ సమయంలోనే అత్యంత రహస్యంగా కుటుంబ సభ్యులు ఎంగేజ్‌మెంట్ చేశారని, త్వరలో పెళ్లి కూడా జరగబోతోందని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలపై కాజల్ స్పందించలేదు.
ఇదిలా వుంటే గత రెండు రోజులుగా కాజల్ లవ్‌లో పడిందని, ఓ యువ వ్యాపార వేత్త, ఇంటిరియర్ బిజినెస్‌మెన్ గౌతమ్ కిచ్లూని ప్రేమిస్తోందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. దీనిపై మంగళవారం కాజల్ అగర్వాల్ క్లారిటీ ఇచ్చింది. యస్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రకటించి షాకిచ్చింది. ఈ వార్తని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా వుంది. ఔతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నాను. 2020 అక్టోబర్ 30న ముంబైలో మా వివాహం జరగనుంది. ఇదొక స్మాల్ ప్రైవేట్ ఫంక్షన్‌లా అత్యంత దగ్గరగా వున్న ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈ పెళ్లిలో పాల్గొనబోతున్నారని వెల్లడించింది.
కొత్త ఈవితాన్ని ప్రారంభించడానికి ఇద్దరం చాలా థ్రిల్ ఫీలవుతున్నాం. నాపై ఇన్నేళ్లుగా అభిమానాన్ని కురిపిస్తున్న మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. అయితే పెళ్లి తరువాత కూడా తన అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే వుంటానని, అయితే కొత్త పంథాలో అని వెల్లడించింది.