Homeటాప్ స్టోరీస్200 కోట్ల దిశగా కబీర్ సింగ్

200 కోట్ల దిశగా కబీర్ సింగ్

Kabir Singh
Kabir Singh

జూన్ 21 న విడుదలైన కబీర్ సింగ్ చిత్రాన్ని చీల్చి చెండాడారు విమర్శకులు , అయితే కబీర్ సింగ్ చెత్త సినిమా అంటూ ఎన్ని విమర్శలు వచ్చాయో అంతకంటే రెట్టింపు కలెక్షన్లు వస్తుండటంతో సినీ విమర్శకులతో పాటుగా ట్రేడ్ అనలిస్ట్ లు సైతం షాక్ అవుతున్నారు . 5 రోజుల్లో 100 కోట్ల మార్క్ దాటేసింది కబీర్ సింగ్ .

మొదటి రోజున 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన కబీర్ సింగ్ రెండో రోజున 22 కోట్లు మూడో రోజున 27 కోట్లు నాలుగో రోజున 18 కోట్లతో మొత్తం నాలుగు రోజుల్లోనే 88 కోట్లు వసూల్ చేసిన కబీర్ సింగ్ 5 రోజు వసూళ్ల తో 100 కోట్ల మార్క్ ని దాటేసింది . షాహిద్ కపూర్కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు . కబీర్ సింగ్ పై ఇప్పటికి కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి అయితే ఎంతగా విమర్శలు వస్తున్నాయో అంతకంటే ఎక్కువే కలెక్షన్లు వస్తున్నాయి . ఈ జోరు చూస్తుంటే కబీర్ సింగ్ 200 కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All