Homeటాప్ స్టోరీస్ఫైన‌ల్‌గా `రాధేశ్యామ్‌`కు మ్యూజిక్‌ డైరెక్ట‌ర్ సెట్ట‌య్యాడు!

ఫైన‌ల్‌గా `రాధేశ్యామ్‌`కు మ్యూజిక్‌ డైరెక్ట‌ర్ సెట్ట‌య్యాడు!

ఫైన‌ల్‌గా `రాధేశ్యామ్‌`కు మ్యూజిక్‌ డైరెక్ట‌ర్ సెట్ట‌య్యాడు!
ఫైన‌ల్‌గా `రాధేశ్యామ్‌`కు మ్యూజిక్‌ డైరెక్ట‌ర్ సెట్ట‌య్యాడు!

వ‌రుస ప్యాన్ ఇండియా స్థాయి చిత్రాల‌తో బిజీగా వున్నారు. `బాహుబ‌లి` త‌రువాత ప్ర‌భాస్ స్టార్‌డ‌మ్ మారిపోయింది. ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆయ‌న న‌టిస్తున్న 20వ చిత్రం `రాధేశ్యామ్‌`. బాహుబ‌లి సీరీస్‌.. సాహో వంటి భారీ చిత్రాల త‌రువాత ప్ర‌భాస్ న‌టిస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ ఇట‌లీలో జ‌రుగుతోంది. పూజా హెగ్డే, ప్ర‌భాస్ ల‌పై కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. `సాహో` చిత్రానికి స్టార్టింగ్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్ స‌మ‌స్య త‌లెత్తిన విష‌యం తెలిసిందే. నార్త్ ఆడియ‌న్స్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని అంద‌రిని ఆక‌ట్టుకునే సంగీత ద‌ర్శ‌కుడి కోసం ఎదురుచూసిన `రాధేశ్యామ్‌` టీమ్ ఫైన‌ల్‌గా `డియ‌ర్ కామ్రేడ్‌` ఫేమ్ జస్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌ని సంగీత ద‌ర్శ‌కుడిగా ఫైన‌ల్ చేశారు.

- Advertisement -

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ వెర్ష‌న్‌ల‌కు సంబంధించిన జస్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందించ‌నున్నారు. హిందీ వెర్ష‌న్‌కు ఎవ‌రు సంగీతం అందిస్తార‌న్న‌ది మాత్రం మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఈ నెల 23న ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి `బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్‌` పేరిట మోష‌న్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేస్తున్నారు. దీనికి జస్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All