Homeటాప్ స్టోరీస్`వ‌కీల్ సాబ్`ని ప్ర‌శంసించిన‌ జ‌డ్జిసాబ్‌!

`వ‌కీల్ సాబ్`ని ప్ర‌శంసించిన‌ జ‌డ్జిసాబ్‌!

`వ‌కీల్ సాబ్`ని ప్ర‌శంసించిన‌ జ‌డ్జిసాబ్‌!
`వ‌కీల్ సాబ్`ని ప్ర‌శంసించిన‌ జ‌డ్జిసాబ్‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. శ్రీ‌రామ్ వేణు అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించిన ఈ మూవీని బోనీ కూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ప‌వ‌ర్‌స్టార్ మూడేళ్ల విరామం త‌రువాత చేసిన సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ నెల 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన స్థాయికి మించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. మ‌హిళా సాధికార‌త నేప‌థ్యంలో అత్యుత్త‌మ‌మైన సందేశంతో తెర‌కెక్కిన ఈ చిత్రంలో వ‌కీల్ సాబ్‌గా ప‌వ‌న్ ప‌వ‌ర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌కి అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కులు, ఉన్న‌త ప‌ద‌వుల్లో వున్న వ్య‌క్తులు కూడా ఫిదా అవుతున్నారు. సినిమాపై, ప‌వ‌న్ న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -

ఇటీవ‌ల ఈ మూవీ చూసిన సుప్రీమ్ కోర్ట్ మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ వి. గోపాలగౌడ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. `మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న అరాచ‌కాల‌పై న్యాయ పోరాట చిత్రంగా `వ‌కీల్ సాబ్‌` నిలిచింది. మ‌హిళ‌ల హ‌క్కుల కోసం పోరాటం చేసే యోధుడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌ట‌న అద్భుతం. ఇలాంటి సినిమాలు మాస్ ఫాలోయింగ్ వున్న హీరోలు చేయ‌రు. కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ సినిమాలో న‌టించ‌లేదు జీవించారు. `వ‌కీల్ సాబ్` అత్య‌ద్భుత‌మైన చిత్రంగా చిర‌స్థాయిగా నిలిచిపోతుంది` అన్నారు సుప్రీమ్ కోర్ట్ మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ వి. గోపాలగౌడ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All