
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం `వకీల్‌సాబ్`. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి చేసిన `అజ్ఞాతవాసి` చిత్రం తరువాత దాదాపు మూడేళ్ల విరామం అనంతరం పవన్‌స్టార్ నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్` ఆధారంగా బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్, అండ్ లిరికల్ వీడియోలకు ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. కొంత విరామం తరువాత పవర్‌స్టార్ నటించిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని పవర్‌స్టార్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదిలా వుంటే అప్పుడే సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిన పవన్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ హోలీ ఫెస్టివెల్ తరువాత మరో హోలీ సెలబ్రేషన్స్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని ఈ నెల 29న అంటే హోలీ తరువాత రోజు రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీజర్, లిరికల్ వీడియోలతో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌తో మరింత హంగామా సృష్టించడం ఖాయం అని చెబుతున్నారు.
The Power ???? In Black-Blazer gets mightier!
Witness it with #VakeelSaabTrailer on March 2️⃣9️⃣th@PawanKalyan #SriramVenu @shrutihaasan @SVC_official @i_nivethathomas @MusicThaman @yoursanjali @AnanyaNagalla @bayviewprojoffl @BoneyKapoor @adityamusic
#VakeelSaabOnApril9th pic.twitter.com/RgTa9W3Uas— Boney Kapoor (@BoneyKapoor) March 24, 2021