Homeటాప్ స్టోరీస్`ఆర్ఆర్ఆర్` సెట్‌లో జూనియర్‌ భీమ్‌!

`ఆర్ఆర్ఆర్` సెట్‌లో జూనియర్‌ భీమ్‌!

 

Jr Bheem from the rrr sets
Jr Bheem from the rrr sets

ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, రామ్‌చ‌రణ్ న‌టిస్తున్నారు. ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ గా కనిపించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో క‌నిపిస్తున్నారు. స్వాతంత్య్ర‌ పోరాటంలో స‌మ‌ర శంఖం పూరించిన ఇద్ద‌రు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల క‌ల్పిత క‌థ‌గా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు.

- Advertisement -

నైజాంలో నిజం పాల‌న‌.. యావ‌త్ ఇండియాలో బ్రిటీష్ పాల‌న సాగుతున్న త‌రుణంలో ఒకానొక ద‌శ‌లో అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీం కొన్ని నెల‌లు క‌నిపించ‌కుండా పోయారు. ఆ స‌మ‌యంలో ఏం చేశారు? ఏం జ‌రిగింది? .. ఈ ద‌శ‌లో ఇద్ద‌రు క‌లిసిశారా? ఒక వేళ క‌లిస్తే ఎలా వుండేద‌నే ఊహ‌జ‌నీత క‌థ‌ని వెండితెర‌పై రాజ‌మౌళి దృశ్య‌మానం చేస్తూ `ఆర్ ఆర్ ఆర్‌`ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇందులో కొమ‌రం భీం పాత్ర‌కు సంబందించిన జూనియ‌ర్ భీమ్ గా ధ్రువ‌న్ న‌టిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో బ‌య‌టికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట సంద‌డి చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ ఆన్ లొకేష‌న్‌కి సంబంధించిన ఓ ఫొటోని ఫేస్ బుక్‌లో ధ్రువ‌న్ పేర్కొడంతో అస‌లు విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All