
దర్శకధీరుడు రాజమౌళి పుట్టిన రోజు నేడు. `బాహుబలి`తో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన దర్శకుడిగా పేరు అంతకు మించిన గౌరవాన్ని దక్కించుకున్నారు రాజమౌళి. బాహుబలి తరువాత ఆయన పేరే ఓ బ్రాండ్‌గా మారింది. ఎంతగా అంటే ఆయన నుంచి సినిమా వస్తోందంటే యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. అంతర్జాతీయంగా చర్చ జరిగేలా క్రేజ్‌ని దక్కించుకున్నారాయన.
ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఈ మూవీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శనివారం జక్కన్న బర్త్‌డే సందర్భంగా విషెస్ చెబుతూ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ షేర్ చేసిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. `ఆర్ ఆర్ ఆర్` సెట్‌లో జక్కన్నతో కలిసి ఎన్టీఆర్ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో ఆకట్టుకుంటోంది. వీరిద్దరి కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో చాలా ప్రత్యేకత వున్న విషయం తెలిసిందే. `స్టూడెంట్ నెం.1`తో వీరి ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
బొద్దుగా వున్న ఎన్టీఆర్ స్లిమ్‌గా మారడానికి కొత్త లైఫ్‌ని ప్రారంభించడానికి రాజమౌళే కారణం. అప్పటి నుంచి ఎన్టీఆర్ అదే ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`లో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొరమం భీం పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఏడు నెలల విరామం తరువాత తిరిగి ప్రారంభమైంది. తారక్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ని ఈ నెల 22న రిలీజ్ చేయబోతున్నారు.
Wishing you a very Happy Birthday Jakkana @ssrajamouli !! Love you pic.twitter.com/gcCdSveiGZ
— Jr NTR (@tarak9999) October 10, 2020