Homeటాప్ స్టోరీస్జోగిపేట్ శ్రీకాంత్ గా ఇరగదీసిన నవీన్ పోలిశెట్టి

జోగిపేట్ శ్రీకాంత్ గా ఇరగదీసిన నవీన్ పోలిశెట్టి

జోగిపేట్ శ్రీకాంత్ గా ఇరగదీసిన నవీన్ పోలిశెట్టి
జోగిపేట్ శ్రీకాంత్ గా ఇరగదీసిన నవీన్ పోలిశెట్టి

షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ వీడియోస్ తోనే నవీన్ పోలిశెట్టి ఎంత మంచి నటుడు అన్నది మనందరం చూసాం. హీరోగా తన మొదటి చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

నవీన్ నటిస్తున్న రెండో సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాలో నవీన్ తో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు కూడా లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అనుదీప్ కెవి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అలాగే నేషనల్ అవార్డ్ విన్నింగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

- Advertisement -

నిన్న నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ ను విడుదల చేసిన బృందం తన క్యారెక్టర్ పరిచయ టీజర్ ను కూడా విడుదల చేసింది. జోగిపేట్ శ్రీకాంత్ పాత్రలో కనిపించనున్నాడు నవీన్. ఈ చిన్న టీజర్ లో సీరియస్ గా డైలాగులు చెబుతున్నా కానీ చాలా ఫన్నీగా అనిపిస్తోంది. మొత్తంగా ఈ 25 సెకన్ల టీజర్ ఆకట్టుకుంది. జాతిరత్నాలుకు సంబంధించి మరిన్ని విశేషాలు త్వరలో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All