Homeటాప్ స్టోరీస్నాని 'జెర్సీ'కి అరుదైన గౌరవం !

నాని ‘జెర్సీ’కి అరుదైన గౌరవం !

నాని 'జెర్సీ'కి అరుదైన గౌరవం !
నాని ‘జెర్సీ’కి అరుదైన గౌరవం !

నేచురల్ స్టార్ నాని చిత్రం ‘జెర్సీ’ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికయ్యింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం ‘జెర్సీ‘. శ్రద్దాశ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి రూపొందించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసల్ని కూడా సొంతం చేసుకుంది. అనిరుధ్ అందించిన సంగీతం ఈ  చిత్రానికి ప్లస్ పాయింట్ గా మారింది. పరాజితుడైన ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరుచుకుని ఏవిధంగా గెలుపొందాడు? జీవితంలో ఒడిగెలిచిన తీరును దర్శకుడు హృద్యంగా తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది.
టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికయింది. ఈ చలన చిత్రోత్సవంలో ‘జెర్సీ’ ప్రదర్శనకు ఎంపిక కావడం సంతోషాన్ని కలిగిస్తోందని, ఆగస్టు 9 నుంచి 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. కెనడాలో ఈ చిత్రం ప్రదర్శించనున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా దిల్ రాజు, అల్లు అరవింద్, అమన్ గిల్ రిమేక్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి ఈ మూవీ తో బాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All