Homeటాప్ స్టోరీస్రాజశేఖర్ కోలుకుంటున్నారు : జీవిత

రాజశేఖర్ కోలుకుంటున్నారు : జీవిత

రాజశేఖర్ కోలుకుంటున్నారు : జీవిత
రాజశేఖర్ కోలుకుంటున్నారు : జీవిత

కరోనా వైరస్ విలయాన్ని సృష్టిస్తోంది. చిన్నా .. పెద్దా అని తేడా లేకుండా అందరినీ హడలెత్తిస్తోంది. జాగ్రత్తలు పాటిస్తున్న వాళ్ళు పాటించని వాళ్ళు  దీని బారిన పడుతున్నారు. సెలబ్రిటీ లు చాలా మంది దీని బారిన పడుతున్నారు. అందులో కొంత మంది సేఫ్ గా బయట పడుతున్నారు. కొంతమంది మాత్రం కరోనా కారణంగా మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో డా. రాజశేఖర్ కరోనా బారిన పడ్డారు. ఆయన కండీషన్ సీరియస్ గా ఉందని వదంతులు వినిపించడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆయన ఫ్యాన్స్ కలవరానికి గురయ్యారు. తాజాగా రాజశేఖర్ ఆరోగ్యం పై క్లారిటీ ఇస్తూ జీవిత ఓ వీడియోని రిలీజ్ చేశారు. రాజశేఖర్ ఆరోగ్యం కుదుట పడిందని ఆయన కోలుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు.
అదృష్ట వశాత్తు ఆయన అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. రాజేశేఖర్ సీరియస్ గా వున్నారని జరుగుతున్న ప్రచారాన్ని జీవిత ఖండించారు. త్వరలోనే ఐసీయూ నుంచి బయటికి వస్తారని గట్టినమ్మకంతో ఉన్నట్టు స్పష్టం చేశారు. ఈ కష్ట కాలంలో అభిమానులు అండగా నిలిచారని భావోద్వేగానికి లోనయ్యారు జీవిత.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All